18ఏళ్ల క్రితం నాటి ధునుష్-ఐశ్వర్యల పెళ్లి ఫోటోలు..!

First Published Jan 18, 2022, 2:10 PM IST

ధనుష్ తన 23 సంవత్సరాల వయస్సులో తన కంటే రెండేళ్లు పెద్ద అయిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు.

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్  విడిపోయారు. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట తమ బ్రేకప్ వార్తను ట్వీట్టర్  ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

నవంబర్ 18, 2004న ధనుష్ తనకంటే పెద్దదైన ఐశ్వర్య రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఐశ్వర్య 2006లో తల్లి అయ్యి కొడుకు యాత్రకు జన్మనిచ్చింది. దీని తర్వాత ఐశ్వర్య 2010లో మరో కొడుకు లింగాకు తల్లి అయింది. ఐశ్వర్య-ధనుష్ పెళ్లికి సౌత్ సెలబ్రిటీలే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
 

ధనుష్ తన 23 సంవత్సరాల వయస్సులో తన కంటే రెండేళ్లు పెద్ద అయిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు.  2003లో కాదల్ కొండేన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ తొలిసారిగా కలిశారు. 2004లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Dhanush Wedding Pics

బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కూడా ధనుష్  ఐశ్వర్యల వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు.. అప్పటి  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత కూడా వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారరు.వీరితో పాటు కమల్ హాసన్, సౌత్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

Dhanush Wedding Pics


'కొలవెరి డి..' పాటతో ధనుష్‌ అత్యంత విజయాన్ని అందించాడు. ధనుష్ ఈ పాట ని  కేవలం 6 నిమిషాల్లో లిరిక్స్ రాశాడని చాలా తక్కువ మందికి తెలుసు. రఫ్ వెర్షన్ పాటను 35 నిమిషాల్లో చిత్రీకరించారు.

Dhanush Wedding Pics

చెన్నైలోని పమ్మల్‌లో ధనుష్‌కి విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ బంగ్లా ఖరీదు దాదాపు రూ.18 కోట్లు. అతను 2013లో ఈ ఇంటిని కొన్నాడు. ఇది కాకుండా, వారికి గెస్ట్ హౌస్ కూడా ఉంది. ధనుష్ ఒక సినిమాకు 7 నుంచి 10 కోట్లు తీసుకుంటాడు. ఇది కాకుండా, వారు ఇతర ఎండార్స్‌మెంట్ల నుండి కూడా సంపాదిస్తారు. అతను పెటాతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.

Dhanush Wedding Pics


ధనుష్‌కి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతను ఆడి A8, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, జాగ్వార్ XE, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

Dhanush Wedding Pics


ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజ్. అతనికి ధనుష్ అనే పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక కూడా ఓ కథ ఉంది. 16 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. ఈ స‌మ‌యంలో త‌న పేరు మార్చుకోవాల‌ని అనుకున్నాడు. 1995లో వచ్చిన 'కురుద్దిపున్నాల్' సినిమాలో 'ధనుష్' అనే మిషన్ ఉంది. దీంతో ప్రభావితుడైన వెంకటేష్ ప్రభు తన పేరును ధనుష్ గా మార్చుకున్నాడు

ధనుష్ ఇప్పటి వరకు చాలా సినిమాలకు పనిచేశాడు. వీటిలో 'తిరుడ తిరుడి' (2003), 'డ్రీమ్స్' (2004), 'పుదుపేట్టై' (2006), 'పొల్లాధవన్' (2007), 'పడికదవన్' (2009), 'సీడన్' (2011), 'అతిర్ నీచల్' ( 2013). ), 'రాంఝనా' (2013), 'మారీ' (2015), 'విఐపి 2' (2017). మంచి విజయం సాధించాయి. 

click me!