ఈ గింజలు వయసును దాచేస్తాయి..అంతేకాదు కీళ్ల నొప్పులు, మలబద్దకం, సోరియాసిస్ వంటి ఎన్నో రోగాలను కూడా తగ్గిస్తాయి

Published : Jul 16, 2022, 03:00 PM IST

Benefits of Flaxseed: అవిసె గింజల్లో దాగున్న ఔషద గుణాలు వయసును దాచేయడంతో పాటుగా మలబద్దకం, గ్యాస్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.   

PREV
110
 ఈ గింజలు వయసును దాచేస్తాయి..అంతేకాదు కీళ్ల నొప్పులు, మలబద్దకం, సోరియాసిస్ వంటి ఎన్నో రోగాలను కూడా తగ్గిస్తాయి

అవిసె గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటీలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆడవారిలో ఈస్ట్రోజన్ లోపం లేకుండా చేస్తాయి.

210

ఇక దీనిలో ఆల్ఫాలినోలెనిక్ అనే పోషకం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. అవిసె గింజలను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

310

క్రమం తప్పకుండా అవిసెగింజలను తినడం వల్ల కడుపునకు సంబంధించిన ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఈ గింజలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం, అతిసారం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

410

అలాగే కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం, వాపు వంటి సమస్యలకు ఇవి చక్కని మెడిసిన్ లా పనిచేస్తాయి. ఇందుకోసం వీటిని వేయించి పౌడర్ లా  చేసుకొని నీటిలో కలుపుకుని లేదా ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. 

510

ఈ గింజలు చర్మ వ్యాధులను కూడా తగ్గించడంలో దివ్య ఔషదంలా పనిచేస్తాయి. సోరియాసిస్, తామర, బొల్లి వంటి వ్యాధులను తగ్గించండంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

610

అవిసె గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు ఉంటాయి.  అలాగే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. 

710
flax seed

అవిసె గింజలు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనివల్ల చర్మ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తప్పుతుంది. 

810
flax seed

షుగర్ పేషెంట్లకు అవిసె గింజలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఇవి మధుమేహం బారిన పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 

910

అవిసె గింజల నూనె ముఖంపై ఉండే ముడతలను, మచ్చలను తగ్గిస్తాయి. ఇందుకోసం టీ స్పూన్ నిమ్మరసంలో టీస్పూన్ ముడి అవిసెగింజలను నూనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 

1010

అవిసె గింజలతో మృతకణాలను కూడా తొలగించొచ్చు. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అవిసె గింజల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి స్క్రబ్ లా ఉపయోగించి.. నీట్ గా నీళ్లతో క్లీన్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories