షుగర్ పేషెంట్లు ఈ అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి..

Published : Jul 16, 2022, 02:09 PM IST

డయాబెటీస్ రోగులు వైట్ రైస్ ను అసలే తినకూడదు. ఎందుకంటే ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది..   

PREV
18
షుగర్ పేషెంట్లు ఈ అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి..
black rice

షుగర్ వ్యాధి ఉన్న వారు వైట్ అన్నాన్ని తినడం తగ్గించడమో.. లేకపోతే మొత్తమో మానుకోవడమో చేయాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఎందుకంటే తెల్ల బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అయితే కొంతమంది మధుమేహులు అన్నాన్ని తినకుండా అస్సలు ఉండలేరు. దీంతో తెల్ల అన్నాన్నే తింటుంటారు. అయితే ఈ వైట్ రైస్ కు బదులుగా బ్లాక్ రైస్ ను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

28

డయాబెటీస్ పేషెంట్లకు బ్లాక్ రైస్ ప్రయోజనాలు

షుగర్ పేషెంట్లకు బ్లాక్ రైస్ చాలా మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ వీరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. 

38

బ్లాక్ రైస్ ప్రయోజనాలు

బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్ లు ఫైన్ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాదు డయాబెటీస్ పేషెంట్లలో డెల్ డ్యామేజీని కూడా  నివారిస్తాయి. మంటను కూడా తగ్గిస్తాయి. 
 

  

48

దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. ఇది బరువు పెరగడాన్ని అడ్డుకుంటుంది. 

58

షుగర్ పేషెంట్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే బ్లాక్ రైస్ ను తినడం వల్ల హార్ట్ పేషెంట్లకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లాక్ రైస్ లో ఆంత్రాసిన్ ఉంటుంది. ఇది ధమనులకు రక్త సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుంది. 

68

బ్లాక్ రైస్ లో ప్రోటీన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో అధిక బరువు నుంచి సులువుగా బయటపడొచ్చు. 

78

ఈ బియ్యాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

88

అంతేకాదు దీనిలో ఉండే గుణాలు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వులను సులువుగా కరిగిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories