పసుపు
పసుపు ఒక శక్తివంతమైన వంటింటి పదార్ధం. ఎందుకంటే పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పసుపు ఎల్లప్పుడు వంటింట్లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఉపయోగకరమైన, ప్రభావవంతమైన పసుపులో గొప్ప శోథ నిరోధక, క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే హీలింగ్ ఏజెంట్స్ త్వరగా నయం కావడానికి సహాయపడతాయి. చిన్న చిన్న గాయాలు, తెగిన గాయాలపై ప్రథమ చికిత్సగా దీనిని ఉపయోగించొచ్చు. దీన్ని పెట్టడం వల్ల మీ చర్మంపై ఏదైనా ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధించబడుతుంది.