పిగ్మెంటేషన్ అనేది మహిళల అందానికి పెద్ద ఆటంకం. ఈ పిగ్మెంటేషన్ ముఖం పై వివిధ భాగాల్లో వచ్చి మనల్ని వేధిస్తుంది. ఇది బుగ్గలు, ముక్కు , కళ్ళ క్రింద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పిగ్మెంటేషన్‌ను ఒకసారి వచ్చింది అంటే తగ్గడం చాలా కష్టం. చర్మంలో మెలనిన్ పెరిగినప్పుడు ఈ మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీ కళ్ల కింద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మీ రూపాన్ని పాడుచేస్తే చింతించాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రిక్స్ తో ఈ సమస్యకు పరిష్కారం చెప్పొచ్చు.
skin pigmentation
ప్రతి ఒక్కరూ తమ కళ్లు అందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ... నల్ల మచ్చలు కంటి అందాన్ని పాడు చేస్తాయి. అయితే... కొబ్బరి నూనెను ఉపయగించడం వల్ల... ఈ మచ్చలను తొలగించవచ్చట. కళ్ల కింద నల్లమచ్చలు ఉంటే కొబ్బరినూనెతో నల్లమచ్చలను తగ్గించుకోవచ్చు.
కొబ్బరినూనె, బాదం నూనె: దీని కోసం అర చెంచా కొబ్బరి నూనె, అర చెంచా బాదం నూనె అవసరం. కొబ్బరినూనె, బాదం నూనె కలిపి కళ్లకు పట్టించాలి. ఐదు నిమిషాల పాటు వేళ్ల సహాయంతో కళ్ల కింద మసాజ్ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే మచ్చలు తగ్గుతాయి. బాదం నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.
కొబ్బరి నూనె, అలోవెరా జెల్: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్‌ను కొబ్బరి నూనెతో కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. రాత్రి మొత్తం అలానే వదిలేయాలి. అలోవెరా జెల్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు చర్మంపై ఉన్న మచ్చలను తేలికపరుస్తుంది. ఇది మీ కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది.
eyebrow health
కొబ్బరి నూనె, పచ్చి పాలు: అంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , అర టేబుల్ స్పూన్ పచ్చి పాలు. కొబ్బరి నూనె ,పచ్చి పాలు సరిగ్గా కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద మసాజ్ చేయండి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత, కళ్ల కింద క్రీమ్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా రోజూ చేయాలి. ఇది మీ కంటి కింద మచ్చలు కనిపించకుండా చేయడమే కాకుండా కంటి కింద ఉన్న ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొబ్బరి నూనెలో ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరినూనె చర్మంపై ఉన్న మృతకణాలను కూడా తొలగిస్తుంది. కొబ్బరి నూనె చర్మంలో తేమ లోపాన్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతేకాదు కొబ్బరినూనె మంచి మేకప్ రిమూవర్. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం మంటను తగ్గిస్తుంది.