Divorce: హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులు పరస్పర అంగీకారంతో తక్కువ సమయంలో విడాకులు పొందే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు 6 నెలల నిరీక్షణ గడువును ఎలా మినహాయించుకోవచ్చో..
వైవాహిక జీవితంలో తీవ్రమైన విభేదాలు వచ్చి కలిసి ఉండలేము అనుకున్నప్పుడు, చట్టం దంపతులకు విడాకుల మార్గాన్ని కల్పిస్తుంది. గతంలో విడాకుల ప్రక్రియకు చాలా సమయం పట్టేది, కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలోనే విడాకులు పొందే వీలుంది.
25
ఇద్దరి అంగీకారం ఉంటే..
పరస్పర అంగీకారం (Mutual Consent):
భార్యాభర్తలిద్దరూ చర్చించుకుని, విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు హిందూ వివాహ చట్టం సెక్షన్ 13B కింద పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇది వేగంగా విడాకులు పొందేందుకు ఉన్న అత్యుత్తమ మార్గం.
కూలింగ్ ఆఫ్ పీరియడ్ మినహాయింపు:
సాధారణంగా విడాకుల పిటిషన్ వేసిన తర్వాత కోర్టు 6 నెలల సమయం(Cooling off period) ఇస్తుంది. అయితే, దంపతులు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంగా విడివిడిగా ఉంటున్నట్లయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ 6 నెలల గడువును మినహాయించాలని (Waive off) కోరుతూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
35
కీలక డాక్యుమెంట్స్, కౌన్సిలింగ్
అవసరమైన పత్రాలు:
విడాకుల పిటిషన్ దాఖలు చేసేటప్పుడు వివాహ ధృవీకరణ పత్రం (Marriage Certificate) ఉండాలి. ఒకవేళ అది లేకపోతే పెళ్లి ఫోటోలు, పెళ్లి పత్రిక వంటి ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియ:
పిటిషన్ వేసిన తర్వాత కోర్టు దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. వారు కలిసి ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని కోర్టు భావించినప్పుడు, ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అన్ని పత్రాలు సరిగ్గా ఉండి, బలమైన కారణాలు చూపితే 15 నుండి 30 రోజుల్లోపు కూడా విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది.
విడాకుల సమయంలోనే భరణం (Alimony), ఆస్తుల పంపకం, పిల్లల సంరక్షణ బాధ్యతలపై దంపతులు ఒక ఒప్పందానికి రావాలి. ఈ విషయాల్లో స్పష్టత ఉంటే కోర్టు ప్రక్రియ మరింత సులభమవుతుంది.
55
న్యాయ నిపుణుల సలహాలు..
ఈ కథనం న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రచురించబడింది. యూజర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని పోస్ట్ చేశాం. మా వెబ్ సైట్ ధృవీకరించలేదు. ఇలాంటి సెన్సిటివ్ మేటర్స్ విషయంలో కచ్చితంగా న్యాయవాది సలహాలు తీసుకోవడం ఉత్తమం.