భారత మార్కెట్లో ప్రెస్టీజ్ (Prestige), ఫిలిప్స్ (Philips), పిజియన్ (Pigeon), బజాజ్ (Bajaj) వంటి ఎన్నో ఉత్తమ కంపెనీలు ఇండక్షన్ స్టవ్‌లు ఉన్నాయి. ఇవి సాధారణంగా 1200W నుంచి 2100W వరకు పవర్ కెపాసిటీతో లభిస్తాయి. వీటిలో ప్రెస్టీజ్, ఫిలిప్స్ మోడల్స్ భారతీయ వంటకాలకు అనువైన ‘ప్రీ-సెట్ మెనూలు’ఉన్నాయి. వీటితో అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ వంటివి ఒక్క బటన్‌తో సులభంగా చేయొచ్చు. వీటి ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటి ధరలు మూడు వేల రూపాయల నుంచి అయిదు వేల రూపాయలలోపు ఉంటాయి.
ఇక ఉష (Usha), హావెల్స్ (Havells), బటర్‌ఫ్లై (Butterfly) వంటి బ్రాండ్లు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌కు తగిన ధరల్లో ఉన్నాయి. నాణ్యత విషయంలో ఇవి కూడా మంచివే. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ , సులువుగా శుభ్రం చేయగల గ్లాస్ టాప్ (Glass top) వంటి ఫీచర్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవ వీటి ధరలు రెండు వేల రూపాయలు దాటి ఉంటాయి.