గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. గురక అసలే రాదు..

Published : Nov 13, 2022, 02:57 PM ISTUpdated : Nov 13, 2022, 02:58 PM IST

శ్వాసకోశ సమస్యతో బాధపడేవారికి గురక ఎక్కువగా వస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. 20 శాతం మంది పెద్దలు నిద్రపోయేటప్పుడు క్రమం తప్పకుండా గురక పెడతారు. 40 శాతం మంది అడపాదడపా గురక పెడతారు. పిల్లల విషయంలో ప్రతి పది మందిలో కనీసం ఒకరైనా గురక పెడతారు.   

PREV
18
 గురకతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. గురక అసలే రాదు..

కొంతమందికి పడుకునేటప్పుడు గురక కచ్చితంగా వస్తుంది. దీనివల్ల గురక పెట్టేవాళ్లు బాగానే పడుకున్నా.. ఇంటిళ్లి పాదికి మాత్రం అస్సలు నిద్ర ఉండదు. నిజానికి శ్వాసలో ఇబ్బంది వల్ల గురక సమస్య వస్తుంది. ఆల్కహాల్ మరీ ఎక్కువగా తాగిన వారు, జలుబు చేసిన వారు కూడా గురక పెడతారు. క్రమం తప్పకుండా గురక పెడితే.. వారిలో  'అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' అనే సమస్య ఉన్నట్టేనంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవడం చాలా అవసరం. 

28

అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పడుకునేటప్పుడు ఎదుర్కొనే శ్వాసకోశ సమస్యగా పరిగణిస్తారు. పలు అధ్యయనాల ప్రకారం.. 20 శాతం మంది పెద్దలు క్రమం తప్పకుండా గురక పెడతారు. 40 శాతం మంది అడపాదడపా గురక పెడతారు. పిల్లల విషయంలో.. ప్రతి పది మందిలో కనీసం ఒకరైనా గురక పెడతారు. ఈ గురక వల్ల ఇతరులకు అస్సలు నిద్రపట్టడదు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. గురక రమ్మన్నా అస్సలు రాదు. అవేంటో తెలుసుకుందాం పదండి..

38

పక్కకు తిరిగి పడుకోవడం

గురక పెట్టే అలవాటుంటే మీరు ఖచ్చితంగా మీరు పడుకునే పొజీషన్ ను మార్చాల్సి ఉంటుంది. వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురకను తగ్గించుకోవచ్చు. పక్కకు తిరిగి పడుకున్నప్పుడు మీ నాలుక చాలా లోపలికి వెళుతుంది. దీంతో గురక తగ్గుతుంది. 

48
snoring

దిండు

అయితే మీ తలను చాలా ఎత్తులో పెట్టి పడుకోవడం వల్ల కూడా గురక శబ్దం రాదు. అంటే రోజూ మీరు తలకింద ఒక దిండు వేసుకుంటే.. ఈ రోజు నుంచి రెండు వేసుకోండి. తల కొంచెం పైకి ఉంటే గురక చాలా వరకు తగ్గుతుంది. అయితే వెన్నునొప్పి, నడుం నొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఇలా చేసే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే దీనివల్ల మీ సమస్యలు ఎక్కువ అవుతాయి.
 

58

వ్యాయామం 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గురక చాలా వరకు తగ్గిపోతుంది. వ్యాయామం వల్ల గాఢంగా నిద్రపోతారు. ఇది గురకను తగ్గిస్తుంది. వ్యాయాయం చేయడం వల్ల మీ రోగ నిరోధక  శక్తి పెరగుతుంది. శరీర శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. మొత్తంగా ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

68

రాత్రిపూట ఎక్కువగా తినడం

రాత్రిపూట ఎక్కువగా తినడం వల్ల, పడుకునే ముందు మాత్రమే తినడం వల్ల గురక  సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి మీరు పడుకోవడానికి రెండు లేదా మూడు గంటల ముందు తినండి. అదికూడా సులువుగా జీర్ణం అయ్యే ఆహారాన్నే తినండి. హెవీగా తినకండి. 

78


మద్యపానం, ధూమపానం

మద్యపానం, ధూమపానం రెండూ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల మీ శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాదు.. గురక సమస్య కూడా పెరుగుతుంది. అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి. అప్పడే ఆరోగ్యంగా ఉంటారు. 

88
snoring

నిర్జలీకరణం

శరీరంలో తగినంత నీరు లేకపోతే.. మన బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అయితే ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా గురక కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా డీహైడ్రేషన్ వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే నీటిని పుష్కలంగా తాగండి.

Read more Photos on
click me!

Recommended Stories