చెవి నొప్పిని చిటికెలో తగ్గించే బెస్ట్ టిప్స్ మీ కోసం..!

First Published Aug 19, 2022, 10:58 AM IST

చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా చెవిలో దురదతో పాటుగా విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో చాలా మంది పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మందులు వేసుకోకుండానే నొప్పి చిటికెలో తగ్గిపోతుంది. 

చెవి నొప్పిని భరించడం అంత సులువు కాదు. ఏ సౌండ్ విన్నా చిరాకు పెడుతుంది. అంతుకు మించి ఈ నొప్పి మనల్ని కుదురుగా ఉండనీయదు. ఈ నొప్పి చెవిలో దురద కారణంగా వస్తుంది. ఈ దురదదకు అతిపెద్ద కారణం ఇన్ఫెక్షన్స్ ను కలిగించే వైరస్ లేదా బ్యాక్టీరియా. వీటివల్లే చెవిలో దురద పెడుతుంది. ఇక చెవినొప్పికి రెండో కారణం.. చెవి చర్మం పొడిబారడం. దీనివల్ల కూడా చెవి నొప్పి పుడుతుంది. 
 

చెవి నొప్పి, దురద లేదా వాపుకు చికిత్స ఏమిటి?

చెవిలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే వైద్యుడిని తప్పక సంప్రదించాలి. అయితే చెవి నొప్పి, దురద నుంచి ఉపశనమం కలిగించేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. అయితే వాటిని ఉపయోగించే ముందు వైద్యుడిని ఒకసారి సంప్రదించడం ఉత్తమం.

అలోవెరా

చెవుల్లో దురదను తగ్గించడంలో అలొవేరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఆలొవేరా జెల్ ను తీసుకుని దురదగా లేదా నొప్పిగా ఉండే చెవిలో రెండు మూడు డ్రాప్స్ ను వేయాలి. కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచి  ఆర్వాత దాన్ని బయటకు తీసేయొచ్చు. ఈ కలబంద చెవి లోపల పిహెచ్ స్థాయిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెవిలో దురద, డ్రై నెస్,  చిరాకు కలిగించే చెవి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

అల్లం

అల్లంలో సహజ శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి చెవి నొప్పిని వెంటనే తగ్గించేందుకు ఎంతో సహాయపడతాయి. అలాగే చెవుల్లో దురద నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం కొద్దిగా అల్లం రసాన్ని తీసుకుని వేడి చేసి వడకట్టి నూనెలో కలపండి. ఇది చల్లారిన తర్వాత చెవి చుట్టూ అప్లై చేయండి. కానీ దీనిని నేరుగా  చెవిలోపల మాత్రం వేయకూడదు. 
 

నూనె

నూనె కూడా చెవిలో దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. చెవి నొప్పిని, దురదను తగ్గించే ఎన్నో రకాల నూనెలు మార్కెట్ లో మనకు లభిస్తాయి. వీటిలో వెజిటేబుల్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ ఉన్నాయి. ఈ నూనెలను అప్లై చేయడానికి ముందుగా ఒక టీస్పూన్ నూనెను తీసుకుని గోరువెచ్చగా వేడి చేయండి. ఆ తర్వాత ఒక డ్రాపర్ తీసుకొని తలను పక్కకు వంచి చెవిలో కొన్ని చుక్కలు వేయండి. ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మీ తలను నిటారుగా ఉంచండి. దీనివల్ల చెవి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 

వెల్లుల్లి 

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో యాంటీ బయాటిక్ గుణాలుంటాయి. చెవినొప్పిని తగ్గించేందుకు చూర్ణం చేసిన వెల్లుల్లిని తీసుకుని నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో కొన్ని నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దాన్ని వడకట్టి చెవిలో కొన్ని చుక్కల నూనెను వేయండి. ఇది చెవి దురదను తగ్గిస్తుంది. 
 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ కూడా చెవినొప్పి, దురదను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ చుక్కలను చెవికి రాసుకుంటే చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కానీ దీనిని పిల్లలకు మూత్రం ఉపయోగించకూడదు. 

click me!