భార్య బయటకు వెళ్తే భర్త చేసే పనులు ఇవా..!

First Published | Aug 19, 2022, 10:02 AM IST

భార్యతో ఉన్నప్పుడు ఒకలా.. భార్య లేకుంటే ఇంకొకలా ఉంటుంటారు పురుషులు. ఇంతకీ భార్య బయటకు వెళ్లినప్పుడు భర్తలు ఏం చేస్తారో తెలుసా..!

ఒంటరి బతుకు చాలా కష్టమైంది. అందుకే జీవితంలో అర్థం చేసుకునే భాగస్వామి రావాలని ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి కోరుకుంటారు. ఇక అలాంటి భాగస్వామే వస్తే ఈ జీవితానికి ఇంతకుమించి ఏం అవసరం లేదనిపిస్తుంది. భార్యభర్తలు కలిసి ఉన్న సమయం ఎంతో మధురంగా ఉంటుంది. ఈ విషయం పెళ్లైన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక భార్య పుట్టింటికో.. లేకపోతే ఆఫీసుకో వెళ్లినప్పుడు ఇంట్లో భర్త ఒక్కడే ఉంటే.. అతను ఎలా ప్రవరిస్తాడనే విషయం ఎంత మందికి తెలుసు.. అవును నేను లేనప్పుడు ఈయన ఎలా ఉంటాడు అన్న అనుమానాలు ఎంత మంది భార్యలకు వచ్చాయి..?  మీరేమనుకున్నారో మాకు తెలియదు కానీ.. భార్యలు లేనప్పుడు భర్త చేసే పనులేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

ఫోన్ కు అత్తుక్కుపోతారు..

భార్య అమ్మగారింటికి వెళ్లినా.. లేదా పనిమీద బయటకు వెళ్లినా.. ఆఫీసుకు వెళ్లినా.. ఇంట్లో ఒంటరిగా ఉండే భర్తలు దాదాపుగా ఎక్కువ సమయంలో ఫోన్ కే కేటాయిస్తారట. అందులో బాత్ రూంలోనే. బాత్ రూంలోకి ఫోన్లనే కాదు..  టాబ్లెట్లను, ల్యాప్ టాప్ లను కూడా తీసుకెళతారట. ఇక ఇంకొంతమందైతే బాత్ రూంలో కూర్చొని  వార్తాపత్రికను కూడా తిరిగేస్తుంటారు.అదికూడా గంటల తరబడి.  
 


పాత స్నేహితులతో మాట్లాడటం..

ప్రతి ఒక్కరికీ స్నేహితులు చాలా మందే ఉంటారు. గజిబిజీ లైఫ్ కారణంగా దోస్తులతో మాట్లాడే టైం ఉండదు. అందులో పెళ్లాం ఉన్నప్పుడు. అందుకే పెళ్లాం ఊరెళ్లినప్పుడు.. బరువు, బాధ్యతలు తగ్గినప్పుడో పాత స్నేహితులకు ఫోన్ చేసి ముచ్చట పెడుతుంటారు. ఇక అందులో పెళ్లాం ఇంట్లో లేనప్పుడు గంటల తరబడి దోస్తులతో మాట్లాడుతుంటారు. అంతేకాదండోయ్ భార్యకు తెలియకుండా స్నేహితురాళ్లలో కూడా ముచ్చటపెడుతుంటారు. 
 

టీవీలో నచ్చిన వాటిని చూస్తుంటారు.. 

ఆడవారికి చాలా మటుకు సినిమాలకంటే సీరియల్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మగవారికి సీరియళ్లు అంటే అస్సలు నచ్చవు. అందుకే ఇంట్లో పెళ్లాం లేనప్పుడు భర్త టీవీకే ఎక్కువగా అత్తుకుపోతాడు. పాత మ్యాచ్ లు, వార్తలు, నచ్చిన సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. 

స్నేహితులతో పార్టీ

ఇదైతే పెళ్లైన ప్రతి పురుషుడు తప్పకుండా చేసుకుంటారు. పెళ్లాం ఊరెళితే చాలు.. ఎంచక్కా దోస్తులందరికీ కాల్ చేసి ఇంటికి పిలిచి పార్టీని చేసుకుంటారు. ఇక ఇంట్లో ఆ రోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇలా పార్టీలు గట్రా చేసుకునేది కేవలం భార్య ఊరికి వెళ్లినప్పుడే. 

ఇష్టమైన వంటను చేసుకుని తింటారు..

భార్యలు ఉన్నప్పుడు ఏ భర్త కనీసం వంటగదిలోకి కూడా అడుగుపెట్టరు. అంతాభార్య చేసిందే తింటుంటారు. వంట మాత్రం చేయరు. నిజానికి భర్తలకు వంటలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకే భార్య లేనప్పుడు తనకు నచ్చిన వంటలు చేసుకుని లాగిస్తారుు. 

Latest Videos

click me!