మనలో దాదాపుగా అందరికీ టీ నో లేకపోతే కాఫీనో తాగే అలవాటైతేే పక్కాగా ఉంటుంది. వీలైతే రోజుకు ఐదారు సార్లైనా తాగే వారు చాలా మందే ఉన్నారు. పాలు, పంచదార కలిపిన ఈ పానీయాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది డయబెటీస్, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి తోడు మన దేశంలో థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.