వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి అందరికీ హాని కలిగించదు. వాస్తవానికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు లేనివారికి వెల్లుల్లి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి అంటువ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెల్లుల్లి జలుబును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే చలికాలంలో సూప్ లు, కూరగాయలలో తప్పకుండా చేర్చాలని నిపుణులు సలహానిస్తుంటారు. చలికాలంలో ఎక్కువగా జలుబు, ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతుంటారు. ఈ సీజన్ లో వెల్లుల్లిని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరిగి ఈ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.