కాఫీ పౌడర్, తేనె హెయిర్ మాస్క్
ఇది అద్భుతమైన హెయిర్ మాస్క్. తేనె తలకు పోషణనిస్తుంది. ఇది అనేక జుట్టు సమస్యల నుండి రక్షిస్తుంది. దీన్ని ఉపయోగించి హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటే జుట్టు సమస్య తీరిపోయి జుట్టు కూడా నిగనిగలాడుతుంది.
పదార్థాలు
1 స్పూన్ కాఫీ పొడి, 1 స్పూన్ తేనె
ఎలా సిద్ధం చేయాలి?
- ఒక గిన్నెలో ఒక టీస్పూన్ కాఫీ పొడిని తీసుకుని, దానికి తేనె కలపండి.
- దీన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించాలి.
15-20 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.