పీరియడ్స్ టైంలో ఈ విషయాలను మర్చిపోతే మీ పని అంతే..

First Published Dec 31, 2022, 12:03 PM IST

అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంతకీ నెలసరి సమయంలో ఎలాంటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నేటికీ పీరియడ్స్ విషయంలో అపోహలు పోలేదు. ఈ అపోహలే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్త్రీ ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి రుతుస్రావం చాలా చాలా అవసరం. అందుకే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. ఏదో పరిశుభ్రంగా ఉంటున్నామన్నట్టుగా కాకుండా.. సరైన పరిశుభ్రత పాటించాలంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మీ చేతులు కడుక్కోవడం మర్చిపోకండి

చాలా మంది ఏదో హడావుడిగా ప్యాడ్ లను మార్చుకుంటారు. కానీ ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోతుంటారు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. శానిటరీ ప్రొడక్ట్ లను అంటే ప్యాడ్ లు, కప్పులు లేదా టాంపోన్ లను మార్చడానికి ముందు, ఆ తర్వాత మీ చేతులను తరచుగా, నీట్ గా శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉండదు. 
 

మిమ్మల్ని మీరు సరిగ్గా శుభ్రం చేసుకోండి

పీరియడ్స్ టైంలో శానిటరీ ప్యాడ్స్ ను మార్చేటప్పుడు మీ జననేంద్రియ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా యోని నుంచి పాయువు వరకు బాగా క్లీన్ చేయండి. వీటిని సరిగ్గా తుడవకపోతే బ్యాక్టీరియాను వ్యాప్తిచెందుతుందది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.  అయితే మిమ్మల్ని శుభ్రం చేసుకోవడానికి బాహ్య రసాయనాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే అవి ఋతుస్రావంలో చికాకును కలిగిస్తాయి. 

తరచుగా పీరియడ్స్ ను మార్చుతూ ఉండండి

పీరియడ్స్ టైంలో ప్రతి కొన్ని గంటలకు మీ శానిటరీ న్యాప్కిన్/టాంపోన్ లను ఖచ్చితంగా మార్చుతూ ఉండాలి. కనీసం 4 నుంచి 6 గంటలకు ఒకసారైనా మార్చుతూ ఉండాలి. ఒకే ప్యాడ్ ను ఎక్కువ సేపు ఉంచుకోవడం అంత సేఫ్ కాదు. అలాగే రుతుచక్ర కప్పులను, పీరియడ్ లో దుస్తులు వంటి ఉత్పత్తులకు పరిశుభ్రంగా ఉంచాలి. 
 

యూజ్ చేసిన వాటిని సరిగ్గా పారేయండి

డిస్పోజబుల్ ప్యాడ్ లను, టాంపోన్ లను ఎప్పుడూ కూడా టాయిలెట్ పేపర్ లేదా టిష్యూ పేపర్ లేదా డిస్పోజబుల్ బ్యాగుల్లో చుట్టండి. ముఖ్యంగా వీటిని బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి. 
 

పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ఉత్పత్తులో వాటిపై దృష్టి పెట్టడమే కాదు.. ఇతర అంతర్గత, బాహ్య కారకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో కాటన్ లోదుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే హైడ్రేటెడ్ గా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. 

మీరు ఉపయోగించే ఉత్పత్తుల నాణ్యత మీ పరిశుభ్రతను కూడా నిర్ధారిస్తుంది. అయితే కృత్రిమ సువాసన కలిగిన ఉత్పత్తులను ఈ సమయంలో ఉపయోగించడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇవి అలెర్జీని కలిగించొచ్చు. జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడానికి మంచి వాసన వచ్చే సబ్బులను ఉపయోగించకూడదు. ఇవి యోని పిహెచ్ ను దెబ్బతీస్తాయి.

click me!