క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే వీటిని రోజూ తినండి

First Published Feb 5, 2023, 3:49 PM IST

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. నిజానికి క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే దీని నుంచి ప్రాణాలతో బయటపడొచ్చు. అయితే కొన్ని ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవేంటంటే..
 

cancer

బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మనం ఎక్కువగా మన శరీరంపై దృష్టి పెట్టలేకపోతున్నాం. ఈ కారణంగా చాలాసార్లు మన శరీరంలో తలెత్తే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా గుర్తించలేం. ఇందులో క్యాన్సర్ కూడా ఒకటి. మనలో ఎంతమందికి క్యాన్సర్ ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే దీని లక్షణాలు అంత సులవుగా బయటపడవు.  దీని ప్రారంభ లక్షణాలపై దృష్టి పెట్టకపోతే సమస్య వేగంగా పెరుగుతుంది. కానీ దీని లక్షణాలను గుర్తించలేకే నేడు ఎంతో మంది అర్థాంతరంగా చనిపోతున్నారు.

cancer

క్యాన్సర్ వల్ల శరీరంలో అసాధారణ కణాల సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది. క్రమంగా ఇవి శరీరంలోని ఇతర భాగాలకు ప్రభావితం చేస్తాయి. నిజానికి క్యాన్సర్ ను పూర్తిగా నియంత్రించలేం. కానీ కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా దీని ప్రమాదాలను తగ్గించొచ్చు. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

cancer

దీని గురించి పరిశోధన ఏమి చెబుతుంది

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉన్న ఆహారం అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. వీటితో పాటు అనేక రకాల మినరల్స్, విటమిన్స్, ఫైటోకెమికల్స్ కూడా క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి.
 

ద్రాక్ష

ద్రాక్ష క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గొప్ప పండుగా పరిగణించబడుతుంది. రెస్వెరాట్రాల్ ముఖ్యంగా ఊదా, ఎరుపు ద్రాక్షలో కనిపిస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని కనుగొనబడింది. అంతే కాదు ఈ పండ్లు క్యాన్సర్ కారకాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది

వెబ్మెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం.. రెస్వెరాట్రాల్ బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి కణాలలో క్యాన్సర్ ప్రక్రియ పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. కానీ పరిశోధనలో ద్రాక్ష క్యాన్సర్ కు నివారణగా పరిగణించబడలేదు.

బ్రోకలీ

బ్రోకలీలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా, జింక్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడానికి అవసరమైన మూలకం. ఇదే కాకుండా బ్రోకలీలో సల్ఫోరాఫేన్ కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ క్యాన్సర్ రీసెర్చ్ 2010 అధ్యయనంలో సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల పరిమాణం, సంఖ్యను 75% వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు. సల్ఫోరాఫేన్ తో పాటు క్రూసిఫరస్ కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.

Image: Getty Images

బీన్స్

బీన్స్ తో ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటుగా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.  కొలొరెక్టల్ క్యాన్సర్ ను నివారించడానికి ఫైబర్ మంచి వనరుగా పరిగణించబడుతుంది. పబ్మెడ్ సెంట్రల్ చేసిన పరిశోధన ప్రకారం.. సరైన మొత్తంలో బీన్స్ ను తినడం వల్ల కొలొరెక్టల్ కణితులు, పెద్దప్రేగు ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే దీని ఎసెన్షియల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి సహాయపడతాయి. 1905 మందిపై జరిపిన పరిశోధనలో ఎక్కువ కాలం బీన్స్ తినేవారికి కొలొరెక్టల్ కణితుల ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలింది.
 

walnuts

వాల్ నట్స్

అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మాదిరిగానే వాల్ నట్స్  లో కూడా మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. వాల్ నట్స్ ఇతర గింజల కంటే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. వాల్ నట్స్ లో పెడుంకుల్జిన్ అనే మూలకం కూడా ఉందని పరిశోధనలో తేలింది. ఇది శరీరంలోకి వెళ్లి యురోలిథిన్గా మారుతుంది. యురోలిథిన్ ఒక రకమైన సమ్మేళనం. ఇది ఈస్ట్రోజెన్ గ్రాహకాలతో అనుసంధానించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది.  

click me!