Relationship Tips: భార్య తన భర్తను అనుమానిస్తుందంటే.. దీనికి కారణాలు ఇవే అయ్యి ఉంటాయి..!

First Published | Jul 3, 2022, 3:52 PM IST

Relationship Tips: పెళ్లి ఎంతో ఎంతో పవిత్రమైంది. ఈ బంధం కలకాలం కొనసాగాలంటే ఇద్దరి మధ్య ఎలాంటి  మనస్పర్థలు రాకూడదు. ముఖ్యంగా అనుమానం అనే భీజం అసలే ఉండకూడదు..
 

నమ్మకంతోనే ఏ బంధమైనా నిండు నూరేళ్లు హాయిగా సాగుతుంది. ఫ్రెండ్ షిప్ నుంచి మొదలు పెడితే భార్యా భర్తల బంధం వరకు ప్రతి రిలేషన్ షిప్ లో నమ్మకమే ముఖ్యమైంది. ఇది లేకపోతేనే రిలేషన్ షిప్ బ్రేకప్ వరకు వెళుతుంది. నమ్మకమనేది లేకపోతే చిన్న చిన్న విషయాలు సైతం పెద్ద కొండలాగే కనిపిస్తాయి. దీంతో వారిద్దరి మధ్యన తరచుగా కొట్లాటలు, మనస్పర్థలు వస్తుంటాయి. 

ఇక పెళ్లైన  ప్రతి జంట తమ భాగస్వాములతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది. ముఖ్యంగా భర్త కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు భార్యలు. అయినా మన భారతీయ సంప్రదాయం ప్రకారం.. భర్తే కుటుంబాన్ని పోషించాలి. ఇప్పుడు ఈ సంప్రదాయం కొంచెం మారిందనుకోండి. చాలా మంది ఆడవారు పెళ్లైనా.. ఖాళీగా ఉండకుండా ఆఫీసులకు వెళుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. కొంతమంది భార్యా భర్తల మధ్య కొద్ది పాటి దూరం అనుమానానికి దారి తీస్తుంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య 10 గంటల గ్యాప్ వస్తే అది అనుమానంగా మారుతుంది. భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానిస్తున్నారో.. దానికి దారి తీసే కారణాలంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos



భార్యతో తక్కువగా మాట్లాడటం

ఏ భార్యైనా సరే తమ భర్త తమతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని భావిస్తుంది. ఎందుకంటే మాటల వల్లే తమ బంధం ఇంకా బలపడుతుంది కాబట్టి. అయితే కొంతమంది పెళ్లై నెలలు గడుస్తున్నా తమ పెళ్లాలతో సరిగ్గా మాట్లాడరు. వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేయరు. బిజీ లైఫ్ కారణంగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే భార్యలకు తమ భర్తపై అనుమానం పుడుతుంది. అంతేకాదు ఇది విడిపోయే దాకా వెళ్లొచ్చు కూడా..
 

అమ్మాయిలతో స్నేహం

పెళ్లి తర్వాత వేరే అమ్మాయితో గంటల తరబడి మాట్లాడినా మీ భార్య మిమ్మల్ని అనుమానిస్తుంది. తను స్నేహితురాలైనా సరే.. భార్య ముందే గంటల తరబడి మాట్లాడటం మంచిది కాదు. ఇలా మాట్లాడితే మీ భార్య అసూయపడుతుంది. దీనివల్ల తరచుగా మీ మధ్య గొడవలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో మీరు.. మీ భార్యకు.. నీ కంటే ఎవరూ ఎక్కువ కాదని భరోసా కల్పించాలి. 
 


మొబైల్ తోనే గడపడం

ఆఫీస్ నుంచి వచ్చిన భర్త తనతో మాట్లాడాలని ప్రతి భార్యా ఆశపడుతుంది. ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటుంది. కానీ కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చాక భార్యలతో మాట్లాడకుండా మొబైల్ ఫోన్లకే అత్తుక్కు పోతారు. సెల్ ఫోన్లను చూసి ఆనందపడే, నవ్వే మగాళ్లనే భార్యలు ఎక్కువగా అనుమానించే అవకాశం ఉంది. అందుకే మొబైల్ ఫోన్లకు బదులుగా జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. 
 

మాజీ ప్రేయసిని మర్చిపోకపోవడం

కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రేమించిన వాళ్లను పెళ్లిచేసుకోలేకపోతారు. తెలియని వ్యక్తితో పెళ్లి జరిగినప్పుడు తమ ప్రేయసిని మర్చిపోలేక కట్టుకున్న భార్యను దూరం పెడుతుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. వివాహం తర్వాత తనే మీకు అన్నీ. అందరిలో తనే మీకు ముఖ్యమైన వ్యక్తి.  మాజీ ప్రియురాలిని మర్చిపోలేకపోతున్నానని మీ భార్యతో ఉన్నప్పుడల్లా ప్రస్తావించకండి. లేకుంటే మీరు ఇంకా తనను ప్రేమిస్తున్నారని, తననే కోరుకుంటున్నారని మీ భార్య భావిస్తుంది. ఇది కూడా మీపై అనుమానం పెరగడానికి ఒక పెద్ద కారణంగా చెప్పొచ్చు. దీనివల్ల మీ భార్య మమ్మిల్ని వదిలేసి వెళ్లే అవకాశం ఉంది.

click me!