
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీనేజర్లు ఎక్కువగా ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలు (pimples) వివిధ కారణాల వల్ల అవుతుంటాయి. జిడ్డు చర్మం (Oily skin) గలవారికి ఇవి ఎక్కువగా అవుతాయి. ముఖంపై సెబమ్ (Sebum) ఎక్కువగా రిలీజ్ అవడం, బ్యాక్టీరియా, హార్మోన్ల హెచ్చు తగ్గులు వంటి కారణాల వల్ల మొటిమలు అవుతాయి.
మొటిమలు రెండు రకలుు.. ఒకటి White heads అయితే మరోటి Black heads. మొటిమలు, మొటిమల కారణంగా అయ్యే మచ్చల కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. దీంతో వీరిలో ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని నిపుణలు వెల్లడిస్తున్నారు.
అయితే కొన్ని రకాల ఆహారాలు మొటిమలు రావడానికి పరోక్షంగా కారణమవుతాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం (Oily skin)ఉన్నవారు వీటిని తింటే మొటిమలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చర్మానికి ఏవి మంచివి ఏవి మంచివి కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మొటిమలకు కారణమయ్యే ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులు (Dairy products), అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (High glycemic index), ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans fats) ఎక్కువగా ఉంటే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మొటిమలు వస్తాయని చర్మ నిపుణులు వెల్లడిస్తున్నారు.
గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే సీరం (Serum)ఇన్సులిన్ సాంద్రత పెరుగుతుంది. దీంతో మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సీరం సెబమ్ (Sebum)ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటుగా సెమోసైట్ వ్యాప్తిని కూడా పెంచుతుంది. అలాగే ఆండ్రోజెన్ పెరగడానికి కూడా కారణమవుతుంది.
ఇవి మొటిమల సమస్యను పెంచుతాయి
పాలు (milk), పాల ఉత్పత్తులు
జంక్ ఫుడ్: బంగాళా దుంపల చిప్స్, ఫ్రైడ్ చికెన్ (Fried chicken), పిజ్జా, చీజ్ బర్గర్ (Cheeseburger)
ప్రాసెస్డ్ ఫుడ్ (Processed food)
చాక్లెట్స్, షుగర్ టీ, కేకులు, క్యాన్డ్ జ్యూస్ లు
వెన్న
వీటిని తింటే మొటిమలు అవుతున్నాయన్న ఆహారాలను మీరు తినకపోవడమే మంచిది. మీ చర్మానికి మేలు చేసే ఆహారాలను తినడం ద్వారానే మొటిమలను నివారించగలరని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
శుద్ధి చేసిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు (Carbohydrates)ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటి వల్ల కూడా మొటిమలు ఏర్పడుతాయి. ఈ కార్బోహైడ్రేట్లు రక్తంలోని చక్కెరతో ఈజీగా కలిసిపోయి.. ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవాళ్లు ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది.
సోయా (soy)మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయినప్పటికీ .. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఫైటోఈస్ట్రోజెన్ (Phytoestrogen) ఉంటుంది. ఇది హార్మోన్లను అసమతుల్యంగా మారుస్తుంది. అలాగే చర్మం వాపు వచ్చేలా చేయడంతో పాటుగా మొటిమలకు కూడా కారణమవుతుంది.
ఇక పాల ఉత్పత్తులను (Dairy products)మోతాదుకు మించి తీసుకుంటే కూడా మొటిమలు అవుతాయని అనేక అధ్యయనాల్లో వెళ్లడైంది. పాల వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరగడంతో మొటిమలు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.