పాన్ తర్వాత ఇప్పుడు ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ ప్రాసెస్ మొదలవుతోంది. దీనికోసం కొత్త ఓటర్లు ఫారం సిక్స్, పాత ఓటర్లు సిక్స్-బి ఫారం నింపాలి. ఈ లింక్ పనిని ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ లేకపోతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఓటర్ సర్వీస్ పోర్టల్ హోమ్ పేజీలో 'మై ప్రొఫైల్' ఎంచుకోండి. కొత్త ఓటర్ అయితే ఫారం సిక్స్, పాత ఓటర్లు సిక్స్-బి ఫారం ఎంచుకోండి.
తర్వాత పేరు, ఊరు, చిరునామా, నియోజకవర్గం ఇలా పూర్తి వివరాలు ఇచ్చి పేజీని ఫిల్ చేయండి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేసి పోర్టల్‌లో ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ చూసి అన్నీ సరిగ్గా ఉంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ నంబర్ ద్వారా మీ ఓటర్ ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.