Switchboard Cleaning: స్విచ్ బోర్డులు నల్లగా మారాయా? చిటికెలో శుభ్రం చేసే టెక్నిక్ ఇది

Published : May 28, 2026, 04:43 PM IST

Switchboard Cleaning: ఎక్కడెక్కడో తిరిగొచ్చి స్విచ్‍లు ఆన్ చేస్తాం. వంట చేస్తూ వేస్తాం. దీంతో స్విచ్ బోర్డులపై మరకలు పడతాయి. క్లీన్ చేస్తే తడికి షాక్ కొడుతుందనుకుంటాం. పెద్ద పనిలా ఫీలవుతాం. ఇంట్లో ఉండే వాటితో శ్రమ లేకుండా నిమిషాల్లో క్లీన్ చేయోచ్చు 

PREV
16
జాగ్రత్త ముఖ్యం బిగిలు

స్విచ్ బోర్డులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటేనే నీట్ గా ఉంటాయి. లేదంటే ఇల్లు ఇంత అందంగా ఉన్నా వాటిపై గీతలు, మరకల వల్ల అవే కనిపిస్తాయి. కాబట్టి శుభ్రం చేసుకోవాలి. స్విచ్ బోర్డును శుభ్రం చేసే ముందు, ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. కాళ్లకు తప్పనిసరిగా చెప్పులు వేసుకోండి. జాగ్రత్ర ముఖ్యం కదా. ఇంట్లో పిల్లలకు ఆ పని అప్పజెప్పకండి. పెద్దవాళ్లు ఉంటే ఆచితూచి జాగ్రత్తగా చేస్తారు. 

26
నెయిల్ పాలిష్ రిమూవర్‌తో మ్యాజిక్

కొద్దిగా దూది తీసుకుని, నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచండి. స్విచ్ బోర్డుపై తేలికగా తుడిస్తే చాలు... ఎలాంటి జిడ్డు మరకలైనా ఇట్టే మాయమవుతాయి. కొత్తవాటిలా మెరిసిపోతాయి కూడా. 

36
షేవింగ్ ఫోమ్‌తో క్లీనింగ్ ట్రిక్

మగవాళ్లు వాడే 'షేవింగ్ ఫోమ్' ఒక సూపర్ క్లీనర్. పాత టూత్‌బ్రష్‌పై కొద్దిగా ఫోమ్ తీసుకుని స్విచ్‌లపై రుద్ది, పొడి గుడ్డతో తుడిస్తే చాలు, బోర్డు తళతళా మెరుస్తుంది. దీనికి నీళ్లు అస్సలు అవసరం లేదు. ఎలాంటి ప్రమాద భయం కూడా ఉండదు.

46
పెన్సిల్ ఎరేజర్ చాలు!

స్విచ్ బోర్డు చుట్టూ నల్లగా వేలిముద్రల మచ్చలు ఉన్నాయా? నీళ్లు, లిక్విడ్ ఏమీ వద్దు. పిల్లలు వాడే మామూలు 'పెన్సిల్ ఎరేజర్‌'తో ఆ మరకలపై రుద్దితే, మురికి మొత్తం పోతుంది. ఇది ఇంకా బెటర్ కూడా. పిల్లలతో కూడా ఈ పని చేయించవచ్చు. వాళ్లకి ఆదో గేమ్ లా ఉంటుంది. కాకపోతే అప్పుడు కూడా జాగ్రత్త ముఖ్యం. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే ఉంచి పని చేయించండి.

56
హెయిర్ స్ప్రేతో ఇలా కూడా చేయొచ్చా?

మీ ఇంట్లో హెయిర్ స్ప్రే ఉంటే, దాన్ని ఒక కాటన్ గుడ్డపై స్ప్రే చేసి స్విచ్ బోర్డును తుడవండి. ఇది మురికిని తొలగించడమే కాకుండా, మళ్లీ త్వరగా మురికి పట్టకుండా ఒక పొరలా కాపాడుతుంది.

66
మొండి మరకలకు ఇదే ఫైనల్ టచ్!

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బల్లి రెట్టలు, నూనె మరకలు ఉన్న బోర్డుల కోసం... నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పేస్ట్ చేయండి. బ్రష్‌తో రుద్ది, 2 నిమిషాల తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే... వావ్, కొత్త బోర్డు రెడీ!

Read more Photos on
click me!

Recommended Stories