మన శరీరంలో నీళ్లే ఎక్కువ శాతం ఉంటాయి. నీళ్లతోనే శరీరం ఎన్నో రోగాల నుంచి తప్పించుకుంటుంది. కానీ చాలా మంది నీళ్లంటేనే ముఖం వికారంగా పెడుతుంటారు. కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగుతుంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే నీళ్లను తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే శరీరంలో నీటి స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి శక్తి ఉండదు. ఎప్పుడూ చూసినా నీరసంగానే ఉంటారు. తలనొప్పి, మలబద్దకం, హెయిర్ ఫాల్, పాలిపోయిన చర్మం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలి. అయితే నీళ్లను తాగడానికి కూడా ఓ పద్దతి ఉంటుందంటున్నారు నిపుణులు. నిలబడి నీళ్లను అసలే తాగకూడదని చెబుతున్నారు. నిలబడి నీళ్లను తాగేకంటే.. కూర్చొని నీళ్లను తాగడం మంచిదంటున్నారు. ఇంతకు నిలబడి నీళ్లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..