మనస్పూర్తిగా ప్రేమించిన అమ్మాయికోసం.. అతను ఏం చేస్తాడంటే...

First Published | Aug 8, 2022, 10:22 AM IST

‘నా కళ్లు చెబుతున్నాయి.. నిన్ను ప్రేమించానని..’ అంటూ వెంటపడే వారు.. నిజంగానే ప్రేమిస్తున్నారా? అమ్మాయిలు ఎలా తెలుసుకోవాలి? అంటే.. ఓ పది విషయాలతో ఆ ప్రేమ నిజమైందో, కాదో ఇట్టే పట్టేయొచ్చట..

ఎంత బిజీగా ఉన్నా సరే.. మీకోసం కాస్త సమయాన్ని తీరిక చేసుకుంటారు. అది ఓ అరగంటే కావచ్చు.. మిమ్మల్ని ఒక దగ్గర్నుంచి వేరే దగ్గర దిగబెట్టడమే కావచ్చు.. కానీ మీతో ఆ సమయాన్ని గడపడం కోసం ప్రయత్నిస్తారు. 

మాట నిలబెట్టుకుంటారు..
నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వారికిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తమ ప్రేమిక సమయాన్ని గౌరవిస్తారు. తానేం వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా తీరుస్తారు.


కుటుంబానికి, స్నేహితులకు..
మిమ్మల్ని బాగా ఇష్టపడి, ప్రేమించిన వ్యక్తి అయితే.. మిమ్మల్ని హైడ్ లో ఉంచడు. తన స్నేహితులకు, కుటుంబసభ్యులకు పరిచయం చేస్తాడు. వాళ్లు కూడా మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకుంటాడు.

క్రేజీనెస్ నూ ఇష్టపడతారు...
మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే.. మిమ్మల్ని మీరుగా అంగీకరించడమే కాదు.. మీ పిచ్చితనాన్ని, చిలిపితనాన్ని కూడా ఇష్టపడతారు. చిన్నపిల్లలా ఎగరడం, కొన్నిసార్లు సిల్లీగా బిహేవ్ చేయడం ఎంజాయ్ చేస్తారు. అతని నవ్వులో నిజాయితీ ఉంటుంది. మీరు ఎలాంటి ఇబ్బంది ఫీల్ కారు.

జడ్జ్ చేయరు..
మీరు చేసే పనులతో మిమ్మల్ని జడ్జ్ చేయాలని చూడడు. పీరియడ్స్ టైంలో, నలతగా ఉన్నప్పుడు, ఆకలి మీదున్నప్పుడు మీకొచ్చే చిరాకు, మీరు పెట్టే నసను అర్థం చేసుకుంటాడు.

అభిప్రాయాలకు విలువనిస్తారు.. 
మీరేదైనా మంచిపని చేస్తే మిమ్మల్ని ప్రశంసిస్తాడు. ఏదైనా చేసేముందు మీ నుంచి సలహాలు తీసుకుంటాడు. మీ సూచనలకు, అభిప్రాయాలకు విలువిస్తాడు.

కలలు సాకారం చేసుకునేలా...
మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తే.. మీ కలలకు రెక్కలు తొడుగుతారు. మీ లక్ష్యాలు సాధించే దిశగా మిమ్మల్ని ఉత్సాహపరుస్తాడు. అది అతను మీకిచ్చే సపోర్టులో తెలిసిపోతుంది. 

పువ్వులు ఇచ్చి.. మహారాణిలా చూసుకుంటానని మాటలు చెప్పడం లాంటి పైపై మాటలు కాకుండా.. అతని ప్రవర్తనలో అది కనిపించేలా చూసుకుంటాడు. మీ పట్ల మృధువుగా వ్యవహరించడం.. కౌగిలింతలు, ముద్దులు.. మురిపెంగా చూసుకోవడంలో అది కనిపించేలా చూసుకుంటాడు.  

మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే.. మీతోపాటు జీవితాన్ని ఊహించుకుంటాడు. పెళ్లి, పిల్లలు.. భవిష్యత్తు ఎలా ఉండాలో కలలు కంటాడు. అది మీతో పంచుకుంటాడు. 

మిమ్మల్ని ప్రేమిస్తే మీ విలువ అతనికి బాగా తెలుసు.. మిమ్మల్ని కోల్పోవడం ఇష్టం ఉండదు. అందుకే మీ కోసం పోరాడతాడు. మిమ్మల్ని రక్షించుకోవడానికి.. దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీతో పోట్లాడడు.

Latest Videos

click me!