Healthy Heart: ఈ హెల్తీ ఫుడ్స్ ను తింటే 40 ఏండ్ల తర్వాత గుండెజబ్బులు కాదుకదా.. ఎలాంటి రోగాలు రావు..

Published : Aug 08, 2022, 09:41 AM IST

Healthy Heart: ఈ రోజుల్లో గుండె జబ్బులు చిన్న వయసు వారికి సైతం వస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.   

PREV
15
Healthy Heart: ఈ హెల్తీ ఫుడ్స్ ను తింటే 40 ఏండ్ల తర్వాత గుండెజబ్బులు కాదుకదా.. ఎలాంటి రోగాలు రావు..

గుండె పనిచేసినన్ని రోజులే మనం ఈ భూమిపై బతికేది. అందుకే దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారు సైతం గుండె జబ్బులతో  బాధపడుతున్నారు. ఈ సమస్య మీకు రాకుండా ఉండాలంటే..పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. వీటిని చిన్న వయసు నుంచి తినడం స్టార్ట్ చేస్తే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు 40 ఏండ్ల తర్వాత వచ్చే గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు రావు. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25

తృణధాన్యాలు (Cereals)

తృణధాన్యాల్లో ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే పోషక విలువలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కానీ శుద్ధి చేసిన ధాన్యాలను మాత్రం అస్సలు తినకూడదు. ఇవి గుండె జబ్బులను పెంచుతాయి. 

35

చాక్లెట్లు (Chocolates)

చాక్లెట్లు తినడం ఇష్టమైతే ఇప్పటి నుంచే డార్క్ చాక్లెట్లను తినడం ప్రారంభించండి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేసే విషపదార్థాల నుంచి రక్షణ కల్పిస్తాయి. మోతాదులో డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఖనిజాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

45

ఆరోగ్యకరమైన కొవ్వు (Healthy fat)

ఆరోగ్యకరమైన కొవ్వు కూడా గుండెకు ఎంతో మంచిది. ఇది ఎక్కువగా సాల్మన్, ట్యూనా చేపల్లో ఉంటుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హెల్తీ ఫ్యాట్స్, వివిధ రకాల విటమిన్లు శరీర పనితీరును మెరుగుపరుస్తాయి. 
 

55

ఆలివ్ ఆయిల్ (Olive oil)

గుండె ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి. ఇతర వంట నూనెలు కొరోనరీ రోగ ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ ఆలివ్  ఆయిల్ అలా కాదు. దీన్ని మీ రోజు వారి వంటల్లో ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. 

Read more Photos on
click me!

Recommended Stories