Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే

Published : Aug 16, 2026, 07:33 PM IST

Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీటిని పరగడుపున తాగితే ఎంతో మంచిది. వాటిలోని పోషకాలను మన పేగులు సులభంగా గ్రహిస్తాయి. దీనివల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.

PREV
13
జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీళ్లు

జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీటిని పరగడుపున తాగడం వల్ల వాటిలోని పోషకాలను పేగులు తేలికగా గ్రహిస్తాయి. ఉదయాన్నే పేగుల గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే, శరీరానికి హైడ్రేషన్ ఇచ్చే ఇలాంటి పానీయాలను పరగడుపున తాగడం ఉత్తమం.

జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీళ్లు కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మూడు పదార్థాలు జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

23
శరీర బరువు తగ్గడానికి సహాయం

జీలకర్ర, వాము, సోంపు కలిపి మరిగించిన నీటిలో బరువు తగ్గడానికి సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ హెల్త్ సైన్స్' పేర్కొంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోజువారీ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

భోజనం తర్వాత సోంపు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జీలకర్ర చూపే సానుకూల ప్రభావం గురించి 'ఫైటోథెరపీ రీసెర్చ్ జర్నల్' (Phytotherapy Research Journal)లో ప్రస్తావించారు.

33
క్యాలరీలు బర్న్ చేస్తుంది

పరగడుపున జీలకర్ర, వాము, సోంపు నీటిని తాగడం వల్ల కడుపులోని యాసిడ్లు సమతుల్యం అవుతాయి. కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

వాము అదనపు క్యాలరీలను బర్న్ చేసి శరీరాన్ని కాపాడుతుంది. జీలకర్రలోని సుగంధ సమ్మేళనాలు వికారం, వాంతుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని గింజలను నమలడం వల్ల కడుపు నొప్పి తగ్గి, వాంతులు కూడా అదుపులోకి వస్తాయి.

జీలకర్ర, వాము, సోంపు జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును పెంచి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాము కషాయం తాగడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగిపోతాయి. వాము యాంటీఆక్సిడెంట్లకు నిధి లాంటిది.

Read more Photos on
click me!

Recommended Stories