ఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే…తెల్లారేసరికి పొంగిపోతూ ఉంటుంది. దానివల్ల కిచెన్ చిందర వందరగా అయిపోతుంది. అందుకే పెద్ద గిన్నెలో వేసి పెడతారు. సౌత్ ఇండియాలో టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశె కామన్. అవి లేకపోతే టిఫిన్ కంప్లీట్ కాదు. రోజూ చేసుకోయాలంటే పిండి రుబ్బడం, కలపడం శ్రమతో కూడిన పని. అందుకే ముందే కాస్త ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజూ వేసుకుంటారు.
ఇడ్లీ, దోశె అంటే ముందు రోజు రాత్రే పిండి రుబ్బి పులియబెట్టాలి. ఇలాంటి సమయంలో ఎదురయ్యే పెద్ద చిరాకు.. పిండి పొంగి గిన్నెలోంచి బయటకు వచ్చేయడం. ఉదయం లేచి చూస్తే కిచెన్ కౌంటర్‌టాప్ అంతా పడిపోయింటుంది. దాన్ని శుభ్రం చేయడం అదో పెద్ద తలనొప్పి. ఎంత పెద్ద గిన్నె వాడినా కొన్నిసార్లు పిండి పొంగిపోతుంది. ఈ సమస్యకు మా అమ్మమ్మల కాలం నాటి ఒక సింపుల్, అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఉంది.