తాజ్‌మహల్ తెల్లని పాలరాతి అందాలు చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వేసవి ఎండలో దాని మెరుపు మరింతగా కనిపిస్తుంది. కానీ అక్కడి ఎండలకు కాసేపు కూడా మీరు తాజ్ మహల్ చూడలేరు. అక్కడ తాజ్ మహల్ చూసేందుకు టిక్కెట్ల కోసం ఎక్కువసేపు క్యూలో నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ప్రేమ చిహ్నాన్ని చూడటానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్లాన్ చేసుకోండి.
ఇక ఢిల్లీని కూడా వేసవిలో చూడకూడదు. అక్కడి వడగాడ్పులు చాలా ప్రమాదకరమైనవి. రోడ్ల మీద నడవడం నిప్పుల మీద నడిచినట్లే ఉంటుంది. వేసవిలో ఢిల్లీ ప్రయాణం అంటే కేవలం షాపింగ్ మాల్స్‌కే పరిమితం కావాలి. చారిత్రక కట్టడాలను సందర్శించడానికి ఇది సరైన సమయం కాదు.