Leftover Chicken Curry: చికెన్ ని చాలామంది ఇష్టంగా తింటారు. ముందు రోజు వండిన చికెన్ కర్రీని ఫ్రిజ్ లో పెట్టుకొని మరుసటి రోజు వేడిచేసుకొని తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. కానీ అది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా తింటే ఏమవుతుందో చూద్దాం.
చికెన్ కర్రీని మళ్లీ వేడిచేసుకొని తింటే ఏమవుతుంది?
సాధారణంగా నిన్నటి చికెన్ కూరను ఫ్రిజ్‌లో పెట్టుకొని మళ్లీ వేడి చేసుకొని తినడం చాలామందికి అలవాటు. టైం లేకపోవడం, ఫుడ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశం, లేదా రుచి ఇంకా బాగుంటుందనే భావనతో చాలామంది ఇలా చేస్తుంటారు. కానీ చికెన్ లాంటి మాంసాహార పదార్థాలను ఇలా తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
బ్యాక్టీరియా పెరిగే అవకాశం
సాధారణంగా చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది త్వరగా బ్యాక్టీరియా పెరిగే వాతావరణాన్ని కల్పిస్తుంది. వండిన తర్వాత కూడా చికెన్ కూరను గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచితే సాల్మొనెల్లా, స్టాఫిలోకాకస్ వంటి హానికరమైన బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఫ్రిజ్‌లో సరిగా నిల్వ చేసినా కూడా, ఒక రోజు తర్వాత దాన్ని మళ్లీ వేడి చేసేటప్పుడు సరైన విధంగా వేడిచేయకపోతే ఆ బ్యాక్టీరియా పూర్తిగా నశించకపోవచ్చు. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
36
ఈ సమస్యలు వచ్చే అవకాశం
ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటివి కనిపించవచ్చు. కొన్నిసార్లు అది తీవ్రమై డీహైడ్రేషన్‌కి కూడా దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, వండిన చికెన్‌ను గది ఉష్ణోగ్రతలో రెండు గంటలకంటే ఎక్కువ ఉంచకూడదు. వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. అలాగే ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌ను 24 గంటల లోపే వాడటం మంచిది. మళ్లీ వేడి చేసేటప్పుడు, మామూలుగా వేడి చేయడం కాకుండా, ముక్కలు మొత్తం వేడయ్యేలా చూసుకోవాలి.
56
మళ్లీ మళ్లీ వేడిచేస్తే..
సాధ్యమైనంత వరకు చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడిచేసుకోకుండా తినేయడమే మంచిది. ప్రతి సారి రీహీట్ చేసినప్పుడు దాని పోషక విలువలు తగ్గిపోతాయి. అంతేకాకుండా రుచి కూడా మారిపోతుంది. అందుకే ఒకసారి వండిన చికెన్‌ను ఒకే సారి పూర్తిగా ఉపయోగించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
66
అది చాలా ప్రమాదం
కొంతమంది చికెన్ నుంచి చెడు వాసన వచ్చినా లేదా కొద్దిగా రుచి మారిన పర్వాలేదు అని తినేస్తుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని అప్పటికే కలుషితం చేసి ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు చేరి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.