Alcohol: ఆల్కహాల్ ప్రేమికులు తాగేటప్పుడు పక్కన కచ్చితంగా తినేందుకు సైడ్ డిష్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరూ తమకు నచ్చిన ఆహారాలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొన్ని ఆహారాలు ఆల్కహాల్ తో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆల్కహాల్ తాగేటప్పుడు చాలామంది దానితో పాటు సైడ్ డిష్‌లు తింటూ ఉటారు. రుచి కోసం, మత్తు తగ్గుతుందన్న భావనతో అనేక రకాల ఆహారాలను తీసుకుంటారు. కానీ లిక్కర్ శరీరంపై చూపే ప్రభావం ఎక్కువ. ఇక దానితో పాటూ తినే ఆహారం కూడా శరీరంపై ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుంది. కొన్ని ఆహారాలు మద్యం ప్రభావాన్ని మరింత పెంచి ఆరోగ్యానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొట్ట, కాలేయం, గుండె, మెదడు వంటి అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఆల్కహాల్ తీసుకునే సమయంలో ఏ ఆహారాలను తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
25
సమోసాలు, పకోడీలు...
ఆల్కహాల్ తాగేటప్పుడు వేయించిన ఆహారాలు తినడం ఏమాత్రం మంచిది కాదు. సమోసాలు, పకోడీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై లాంటి నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి. లిక్కర్ వల్ల కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇక ఈ నూనెతో వండిన ఆహారాలు ఆల్కహాల్ తో కలిసి శరీరం వాటిని జీర్ణించలేక ఇబ్బంది పడుతుంది. పొట్టలో భారంగా అనిపించడం, గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. తరచూ ఇలా తింటూ ఆల్కహాల్ తాగితే కాలేయ కొవ్వు పెరగడం, కాలేయ పనితీరు తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నూనెతో చేసిన ఆహారాలు లిక్కర్ తాగే సమయంలో మంచివి కావు.
35
కారంగా ఉండే ఆహారాలు
కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను ఆల్కహాల్ తో పాటూ తినేందుకు ఇష్టపడతారు. పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కారం ఎక్కువగా వేసిన కూరలు, స్పైసీ చికెన్ వంటివి తింటే పొట్ట లోపలి పొరను చికాకుపెడతాయి. మద్యం వల్ల కడుపు లోపలి పొర ఇప్పటికే సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే గుండెల్లో మంట, పొట్ట మంట, నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కొందరికి పొట్టలో పుండ్లు, రక్తస్రావం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, అల్సర్ సమస్యతో బాధపడేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
తీపి పదార్థాలు ఆల్కహాల్ తో పాటూ తినడం మంచివి కావు. చాక్లెట్లు, కేకులు, స్వీట్లు లాంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. లిక్కర్ తాగినప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలలో మార్పులు వస్తాయి. తీపి ఆహారం తీసుకుంటే మొదట రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, తర్వాత ఒక్కసారిగా పడిపోవచ్చు. దీని వల్ల తలనొప్పి, అలసట, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరికి ఆల్కహాల్ మత్తు ఎక్కువగా అనిపించడానికి కూడా ఇది కారణం కావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మద్యం సమయంలో తీపి ఆహారాలను పూర్తిగా తప్పుకోవడం చాలా అవసరం.
55
కూల్ డ్రింకులు
కార్బొనేటెడ్ పానీయాలు, సోడాలు, కోలా లాంటి వాటిని కూడా ఆల్కహాల్ తో పాటూ తీసుకోవడం మంచిది కాదు. ఇవి పొట్టలో గ్యాస్ పెంచుతాయి. అంతేకాదు ఆల్కహాల్ శరీరంలోకి త్వరగా చేరేందుకు ఇవి సహాయపడతాయి. దాంతో మత్తు వేగంగా ఎక్కి నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న చిప్స్ వంటి స్నాక్స్ కూడా దాహాన్ని పెంచుతాయి. దాంతో మరింత లిక్కర్ తాగాలనే కోరిక కలగవచ్చు. అందుకే లిక్కర్ తీసుకునే వారు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.