ఇలాంటి మహిళను వివాహం చేసుకుంటే.. లైఫ్‌ బిందాస్‌, అలాంటి వారితో మాత్రం చాలా కష్టం

First Published | Dec 21, 2024, 4:10 PM IST

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టుక, చావు రెండు మన చేతుల్లో ఉండవు.. కాస్తో కూస్తే మన చేతిలో ఉండేది మన పెళ్లి మాత్రమే. అందుకే నచ్చిన వారిని వివాహం చేసుకోవాలని భావిస్తుంటారు. తమకు కాబోయే వారి కోసం ఎన్నో కలలు అంటారు. ముఖ్యంగా పురుషులు తమకు కాబోయే భార్యలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు.. 
 

పెళ్లి అనేది నూరెళ్ల జీవితానికి ఒక బీజం లాంటిదని చెబుతుంటారు. ఈ బంధం కలకాలం సంతోషంగా సాగాలంటే నచ్చిన భాగస్వామిని ఎంచుకోవాలని చెబుతుంటారు. అయితే జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే వివాహం చేసుకునే అమ్మాయిలో కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ ఎలాంటి లక్షణాలున్న స్త్రీని వివాహం చేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే వివాహం చేసుకోబోయే మహిళలకు అత్యాశ ఉండకూదు. దురాశలేని స్త్రీలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందే మనస్తత్వం ఉన్న వారిని వివాహం చేసుకుంటే జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇక వివాహం చేసుకునే మహిళల్లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి వారి నిత్యం శాంతంగా ఉంటారు. ఇలాంటి భావాలు ఉన్న మహిళలు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇస్తారు. 
 


కష్టం విలువ తెలిసిన అమ్మాయిలను వివాహం చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వారు దుబార ఖర్చులను చేయరు. అలాగే అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. జీవితంలో కష్టం విలువ తెలిసిన వారిలో విజయం సాధించాలన్న కసి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిని వివాహం చేసుకుంటే మీకు సరైన భాగస్వామి లభించినట్లే. ప్రేమించే వ్యక్తి కంటే అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమని చెబుతుంటారు. ఇది అక్షర సత్యం. జీవితంలో అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఏదైనా సాధించవచ్చు. 
 

సాధారణంగా భార్యల విషయంలో గొడవలు రావడానికి పుట్టింటి, మెట్టినింటి మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలిసిందే. అందుకే భార్యగా వచ్చే మహిళ అటు తల్లి గారి ఇల్లితో పాటు, అత్తగారి ఇంటి మధ్య సమన్వయం చేసుకునే గుణం ఉండాలి. ఆర్థిక, కుటుంబ స్థితిగతులను సమతుల్యం చేసుకునే మహిళలు సమస్యలు రానివ్వరు. ఇలాంటి మహిళలు ఉన్న ఇల్లు నిత్యం సంతోషంగానే ఉంటుంది. 
 

ఇలాంటి వారితో ఇబ్బందులు..

చాణక్య నీతి ప్రకారం.. కోపం ఎక్కువగా ఉండే మహిళలతో ఇబ్బందులు తప్పవు. కోపం సహజ ఎమోషన్‌ అయినా అధికంగా ఉంటే సమస్యలు వస్తాయి. ప్రతీ విషయంలో కోపం తెచ్చుకునే మహిళలను వివాహం చేసుకోకపోవడమే మంచిది. ఇక ప్రతీ చిన్న విషయాన్ని అసహనాన్ని వ్యక్తం చేసే వారికి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి వారు పక్కన ఉంటే జీవితంలో ఇబ్బందులే వస్తాయి. స్వార్థం, అత్యాశ, అతిగా కోరికలు ఉండే మహిళలతో వివాహం ఇబ్బందులకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు నిపుణులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 

Latest Videos

click me!