మంచి తల్లి అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Dec 21, 2024, 2:09 PM IST

పిల్లలను పెంచే విషయంలో మంచి తల్లి అవ్వాలన్నా, అనిపించుకోవాలన్నా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Mother daughter

తమ పిల్లలను చాలా బాధ్యతాయుతంగా పెంచాలనే కోరిక చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ముఖ్యంగా తండ్రుల కంటే తల్లులదే  ఎక్కువ బాధ్యత అని చెప్పొచ్చు. అయితే.. పిల్లలను పెంచే విషయంలో మంచి తల్లి అవ్వాలన్నా, అనిపించుకోవాలన్నా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Strengthen the mother-daughter bond

పిల్లలను తల్లి అమితంగా ప్రేమిస్తుంది. అయితే.. వారికి ప్రేమ, ఆప్యాయత పంచడంతో పాటు.. మీరు వారి పై ఎంత శ్రద్ధ వహిస్తారో, వారి సద్గుణాలను పెంపొందించడంలోనూ శ్రద్ధ చూపించాలి. పిల్లలు కోపం చూపించినా, మాట వినకపోయినా… మనం ఓపికగా ఉండేందుకు ప్రయత్నించాలి. వారు చేసేది ఎంత తప్పో చెప్పడానికి ప్రయత్నించాలి. కోపంగా కొట్టకూడదు.



పిల్లల కోరికలన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం లేదు. వారి అవసరాలను గమనించి మాత్రమే కొనాలి. వారికి నిజంగా ఏది అవసరమో తెలుసుకొని,  ఆ విషయంలో వారిని ప్రోత్సహించి.. వారికి అది కొనివ్వాలి.

పిల్లలు తమ తండ్రుల కంటే తల్లికి అన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి, తల్లులు తమ పిల్లలను ఎప్పుడూ స్నేహితుల్లా చూసుకోవాలి.

అన్ని కుటుంబాలకు కష్టాలు వస్తాయి. మీ పిల్లలు అడిగే వస్తువులను కొనకుండా వారిని అడ్డుకోవద్దు. ముఖ్యంగా తల్లులు ప్రతిసారీ తాము అడిగినవి కొనలేమని చెప్పినప్పుడు, వారికి మీపై ప్రేమ తగ్గుతుంది. కాబట్టి.. వీలైనంత వరకు నిజంగా వారికి అవసరం అయినవి అయితే కొనివ్వడానికి ప్రయత్నించండి.

మీ పిల్లలతో ఎల్లప్పుడూ మర్యాదగా మాట్లాడండి. వారికి నచ్చిన విషయాలు నేర్పడానికి ప్రయత్నించండి.

తల్లులు తమ పిల్లల పట్ల ఎప్పుడూ చాలా ఆప్యాయంగా ఉండాలి. మీ పిల్లలు చేసే చిన్న చిన్న పనులను కూడా మెచ్చుకోండి. అది వారికి మరింత సంతోషం, ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
 

Latest Videos

click me!