ఈ పండ్లను ఇవ్వకండి..
దగ్గు వల్ల గొంతుతో పాటుగా కడుపు నొప్పి పెడుతుంది. అయితే ఈ దగ్గు నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం వారికి 15 నుంచి 20 రోజుల వరకు ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, లిచీలను అసలే ఇవ్వకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. నిజానికి అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రోన్కైటిస్, అధిక జ్వరం, టాన్సిల్స్లిటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచుగా సోకుతుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పండ్లను ఎందుకు తినకూడదంటే.. స్ట్రాబెర్రీలు హిస్టామిన్ ను విడుదల చేస్తుంది. ఈ హిస్టామిన్ దగ్గును కలిగిస్తుంది. ఇప్పటికే దగ్గు ఉంటే అది మరింత ఎక్కువ అవుతుంది. ఇకపోతే ద్రాక్ష, లిచీల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. అందుకే ఈ పండ్లను పిల్లలకు తినిపించకూడదని నిపుణులు చెబుతున్నారు.