ఇలా చేస్తే కీళ్ల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి..

First Published Jan 26, 2023, 3:57 PM IST

ప్యూరిన్ పెరుగుదల యూరిక్ ఆమ్లాన్ని ప్రేరేపిస్తుంది. ఇది చలికాలం కీళ్ల నొప్పులను పెంచుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. 
 

కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు మన శరీరంలో ప్యూరిన్ మొత్తాన్ని పెంచుతాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది శరీరంలో గౌట్ లేదా ఆర్థరైటిస్ సమస్యకు కారణమవుతుంది. అందుకే ఆర్థరైటిస్ సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అసలు ప్యూరిన్ పెంచే ఆహారాలు ఏంటి? ఆర్థరైటిస్ ను ఎలా నియంత్రించాలో  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ప్యూరిన్, యూరిక్ ఆమ్లం మధ్య సంబంధం ఏమిటి?

యూరిక్ ఆమ్లం రక్తంలో ఉండే వ్యర్థ ఉత్పత్తి. ఇది శరీరంలోని ప్యూరిన్ అనే రసాయనం నుంచి తయారవుతుంది. యూరిక్ ఆమ్లం చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది లేదా మూత్రపిండాల గుండా వెళ్లి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళుతుంది. కానీ ఇది పెరిగినప్పుడు మూత్రపిండాలు బయటకు తీయలేకపోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు వస్తాయి. 
 

 ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు 

సీఫుడ్ (ముఖ్యంగా ఎండ్రకాయలు, సార్డినెస్)
రెడ్ మీట్  
అవయవ మాంసం (లివర్)

ఆల్కహాల్ (బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్)
 


ఈ ఆహారాలు మూత్రపిండాలపై భారాన్ని ఎలా పెంచుతాయి? 

మూత్రపిండాలు అవసరమైనప్పుడు యూరిక్ ఆమ్లాన్ని శరీరంలోకి విడుదల చేసి మిగిలిన వాటిని ఫిల్టర్ చేసి శరీరం నుంచి బయటకు పంపుతాయి. తద్వారా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం నార్మల్ గా ఉంటుంది. అయితే మన మూత్రపిండాలు సరిగ్గా పని చేయలేనప్పుడు యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని కీళ్లలో నొప్పి కలుగుతుంది.  అయితే కొంతమందికి మందులు అవసరం లేకుండానే ఈ కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. కాకపోతే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 

మాయో క్లినిక్ ప్రకారం.. గౌట్ డైట్ అంటే గౌట్ సమస్య నుంచి రక్షించే ఆహారం రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించగలదు. ఇది గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీళ్ళకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. 

బరువు తగ్గండి

ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే.. గౌట్ సమస్యలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోండి. బరువు తగ్గితే గౌట్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. బరువు తగ్గడం వల్ల కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

సంక్లిష్ట పిండి పదార్థాలు

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. ఎక్కువ ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాలు, పానీయాలను నివారించండి. సహజంగా  మరీ తియ్యగా ఉండే పండ్ల రసాలను తీసుకోవడం మానుకోండి.

విటమిన్ సి

విటమిన్ సి మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుందో ఎలాంటి పరిశోధనలు ఇంకా వెల్లడించలేదు. యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించడానికి విటమిన్ సి ని పెంచడం మీకు ప్రయోజనకరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుడితో మాట్లాడాలి. కావాలనుకుంటే విటమిన్ సి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. 
 

నీరు పుష్కలంగా త్రాగాలి:  శరీర అవసరాలకు అనుగుణంగా నీటిని తాగాలి. అంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. అప్పుడే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 

కొవ్వు: ఎర్ర మాంసం, కొవ్వున్న పౌల్ట్రీ, అధిక కొవ్వు పాల ఉత్పత్తులను, సంతృప్త కొవ్వులను చాలా వరకు తగ్గించాలి. 

ప్రోటీన్ :  ప్రోటీన్ ఎక్కువగా ఉండే సన్నని మాంసం, పౌల్ట్రీ, తక్కువ కొవ్వు పాలు , పప్పుధాన్యాలను ఎక్కువగా తినండి.

click me!