Turmeric Ice Cubes: పసుపు, ఐస్ క్యూబ్స్‌తో ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది

Published : May 27, 2026, 12:35 PM IST

Turmeric Ice Cubes: ముఖం డల్ గా అనిపిస్తోందా. అయితే పసుపు, ఐస్ క్యూబ్స్ చిట్కాను పాటించండి. ఇది ఆయుర్వేదం, క్రయోథెరపీల కలయిక అయిన ఈ పద్ధతి, పసుపులోని గుణాల వల్ల చర్మానికి సహజమైన మెరుపు అందుతుంది.

PREV
14
పసుపు ఐస్‌ క్యూబ్స్‌తో అందం

వేసవిలో ముఖం డల్ గా కనిపిస్తుంది. చర్మం నిర్జీవంగా అనిపిస్తుంది.  అద్దంలో చూసుకోగానే ముఖం అందంగా కాకుండా ఉబ్బినట్టు కొన్నిసార్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు ముఖానికి పసుపు, ఐస్ క్యూబ్స్‌ చిట్కాను పాటిస్తే చర్మం మెరిసిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి ఫలితాలు వస్తాయి.

24
తక్కువ ఖర్చుతో మెరుపు

 ఆయుర్వేదం, ఆధునిక 'క్రయోథెరపీ' (ఐస్ థెరపీ)ల కలయికతో వచ్చే చిట్కా ఇది. ముఖం డల్‌గా ఉండటం, చర్మంపై మంట, వాపు వంటి సమస్యలను ఇది ఒకేసారి తగ్గిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో కూడిన హోమ్‌మేడ్ రెమెడీ ఇది. ముఖానికి ఐస్ క్యూబ్ రుద్దినప్పుడు, రక్తనాళాలు కుచించుకుపోయి ముఖం వాపు, ఎరుపుదనం వెంటనే తగ్గుతాయి. ఐస్ తీసేయగానే ఆ ప్రదేశానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తం వేగంగా ప్రవహిస్తుంది. దీనివల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

34
పసుపులోని అద్భుత గుణాలు

పసుపులో ఉండే 'కర్కుమిన్' అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ అని తెలిసిందే.ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాదు, చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ను దూరం చేస్తుంది.

44
ఐస్ క్యూబ్స్ తయారీ విధానం

ఇంట్లో వాడే పసుపు కన్నా ముఖం కోసం కస్తూరి పసుపును కొనుక్కుంటే మంచిది. ఒక చెంచా కస్తూరి పసుపును అర కప్పు రోజ్ వాటర్ లేదా అలోవెరా జ్యూస్‌లో కలపాలి. పొడి చర్మం ఉన్నవాళ్లు ఒక చెంచా పాలు లేదా తేనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి 6-8 గంటలు ఫ్రీజర్‌లో పెట్టాలి.

ఐస్ బర్న్ అవ్వకుండా ఉండాలంటే, ఐస్ క్యూబ్‌ను నేరుగా ముఖంపై రుద్దకూడదు. ఒక పలుచని కాటన్ క్లాత్‌లో చుట్టి, 1 నుంచి 2 నిమిషాల పాటు ముఖంపై గుండ్రంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు ఆరనిచ్చి, చల్లటి నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories