Hair Fall: హెల్మెట్, టోపీ పెట్టుకుంటే జుట్టు రాలుతుంది అనేది నిజమేనా?

Published : Sep 17, 2025, 05:50 PM IST

Hair Fall: ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే టోపి పెట్టుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా వెంట్రుకలు ఊడిపోతాయని చాలా మంది నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతుందంటే? 

PREV
15
హెయిర్ ఫాల్

ఈ రోజుల్లో జుట్టు రాలడం, బట్టతల ఏర్పడటం కామన్ విషయం అయిపోయింది. నిజానికి జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. అందుకే జుట్టు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి మాత్రం ఫలించవు. ఈ సంగతి పక్కన పెడితే చాలా మంది హెల్మెట్, టోపీలు పెట్టుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుందని నమ్ముతారు. అసలు దీనిలో నిజమెంతుందో తెలుసుకుందాం పదండి.

25
హెల్మెట్, టోపీ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా?

నిపుణుల ప్రకారం.. హెల్మెట్, టోపీ పెట్టుకోవడం వల్ల జుట్టురాలడానికి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ఇవి కూడా కారణం కావొచ్చు. నిజం చెప్పాలంటే టోపీ పెట్టుకోవడం వల్ల హానికరమైన సూర్యకిరణాలు, కాలుష్యాల నుంచి మన జుట్టు సేఫ్ గా ఉంటుంది. ఇక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే బైక్ పై వెళ్లేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ను పెట్టుకోవాలని చెప్తుంటారు. కానీ ఈ రెండింటి మూలంగా కొన్ని సందర్భాల్లో జుట్టు ఊడిపోయే ఛాన్స్ మాత్రం ఉంది.

హెల్మెట్ కానీ, టోపీ కానీ చాలా టైట్ గా ఉంటే మాత్రం జుట్టు ఖచ్చితంగా ఊడిపోతుంది. ఎందుకంటే ఇవి టైట్ గా ఉండటం వల్ల జుట్టు గట్టిగా లాగినట్టు అవుతుంది. ఈ కారణంగా జుట్టు రాలుతుంది. వెంట్రుకలు తెగిపోతాయి. ఎక్కువ సేపు టోపీ, హెల్మెట్ ను పెట్టుకోవడం వల్ల నెత్తిమీద చెమట పడుతుంది. దీంతో నెత్తికి దుమ్ము, ధూళి అంటుకుంటాయి. వీటివల్ల నెత్తిమీద చుండ్రు ఏర్పడుతుంది. దీంతో జుట్టు మూలాలు బలహీనంగా అయ్యి ఊడిపోతాయి. అంతేకానీ హెల్మెట్ వల్ల, టోపీ వల్ల బట్టతల మాత్రం రాదని నిపుణులు చెబుతున్నారు.

35
జుట్టు ఎందుకు రాలుతుంది?

జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పోషకాల లోపం, హార్మోన్లలో మార్పులు రావడం, జెనెటిక్స్, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

45
టోపీ, హెల్మెట్ వల్ల జుట్టు రాలకూడదంటే ఏం చేయాలి?

టోపీ, హెల్మెట్ వల్ల జుట్టు ఊడిపోతుంది అనుకుంటే మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చాలా టైట్ గా ఉండే హెల్మెట్ కానీ, టోపీని కానీ పెట్టుకోకూడదు. అలాగే ఎక్కువ సేపు వీటిని ధరించకూడదు. టోపీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. హెల్మెట్ ను వేరేవారితో షేర్ చేసుకోకూడదు. మీరు హెల్మెట్ ను పెట్టుకుంటే మీ తలపై ఖచ్చితంగా కాటన్ క్లాత్ ను పెట్టండి. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు టోపీని, హెల్మెట్ ను పెట్టుకోకండి. అలాగే హెల్మెట్ ను తరచుగా క్లీన్ చేస్తూ ఉండండి. ఒక్క టోపీనే రోజూ పెట్టుకోవడం మానేయండి.

55
హెయిర్ ఫాల్

అలాగే వారానికి రెండు మూడు సార్లు జుట్టును నూనె పెట్టి మసాజ్ చేయండి. దీనివల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరిగి మీ వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే తలస్నానానికి తేలికపాటి షాంపూనే వాడండి. అలాగే నెత్తిని శుభ్రంగా ఉంచుకోండి. ఈ చిట్కాలు పాటిస్తే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories