Cabbage Worms: వానాకాలంలో క్యాబేజీ తింటే నిజంగానే మెదడులో పురుగులు చేరుతాయా? వైద్యులు ఏం చెబుతున్నారు

Published : Aug 12, 2025, 06:46 PM ISTUpdated : Aug 12, 2025, 06:47 PM IST

వానాకాలంలో క్యాబేజీలు అధికంగా పండుతాయి. కానీ చాలామంది వానాకాలంలో క్యాబేజీలు తినేందుకు భయపడతారు. దీనివల్ల మెదడులో పురుగులు వస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో వైద్యులు వివరిస్తున్నారు. 

PREV
15
క్యాబేజీ తింటే మెదడులోకి పురుగులు

వానకాలంలో ఆకుకూరలు, క్యాబేజీలు అధికంగా పండుతాయి. కానీ వాటిలో పురుగులు త్వరగా చేరిపోతాయి. అందుకే వానాకాలంలో క్యాబేజీ తినాలంటేనే ఎంతోమంది భయపడతారు. క్యాబేజీలో కంటికి కనిపించనంత పురుగులు ఉంటాయని.. అవి మెదడులో చేరుతాయని అంటారు. క్యాబేజీ తినడం వల్ల నిజంగానే పురుగులు వస్తాయో రావో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రియాంక శరావత్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

డాక్టర్ ప్రియాంక శరావత్ మెదడులో పురుగులను కలగజేసే ఆహారాలు గురించి వివరించారు. ఈ డాక్టర్ చెబుతున్న ప్రకారం ఏదైనా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడులో పురుగులు చేరే పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ అని అంటారు. ఇక మెదడులో చేరిన పురుగులను తెలియ టెనియా సెలియం అంటారు.

25
ఏమిటా పురుగులు?

టేనియా సెలియం అని పిలిచే పురుగులు మెదడులో చేరాక పాకడం, కదలడం వంటివి చేయవు. కానీ ఈ పురుగు గుడ్లను పెడతాయి. ముఖ్యంగా ఇవి మురికి కూరగాయలు, సగం ఉడికించిన మాంసాలు వంటి వాటిలో కనిపిస్తాయి. కూరగాయలను సరిగ్గా కడక్కుండా, ఉడికించకుండా తింటే ఈ పురుగు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే సరిగ్గా ఉడకని మాంసాన్ని తినడం వల్ల కూడా ఈ పురుగులు శరీరంలోకి చేరవచ్చు. జీర్ణవ్యవస్థ ఈ పురుగులను జీర్ణం చేసుకోలేదు. దీనివల్ల పురుగులు శరీరం నుండి బయటకు రావు. అవి కళ్ళు, కాలేయం, ఎముకలు, మెదడు, ఊపిరితిత్తులు భాగాల్లోకి చేరుతాయి. మొదటగా శరీరంలోని మెదడు, కంటి కండరాల్లోకి ప్రవేశిస్తాయి.

35
మెదడులో చేరితే ఏమవుతుంది?

ఈ పురుగులు మెదడులోకి చేరిన తర్వాత మెదడు తన రక్షక కణాలతో వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత త్వరగా చనిపోవు. దీనివల్ల మెదడువాపు సమస్య వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల రోగికి మూర్చలు రావడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మెదడును స్క్రీనింగ్ చేయడం, పలు పరీక్షలు చేయడం ద్వారా ఈ పురుగులను గుర్తిస్తారు వైద్యులు.

45
చికిత్స ఎలా ఉంటుంది?

నిజానికి మెదడులో పురుగులు చేరడం వల్ల వచ్చే న్యూరోసిస్టిసెర్కోసిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. కానీ దీనికి చికిత్స ఉంది. మందుల సహాయంతో దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. కానీ ఒక్కోసారి ఇది తీవ్రంగా మారిపోతుంది. అలాంటి సమయంలో మాత్రం మెదడుకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ముందుగా ఉడికించని ఆహారాన్ని, మాంసాన్ని తినకూడదు. అలాగే కూరగాయలను పరిశుభ్రంగా కడిగిన తర్వాత బాగా ఉడికించాకే తినాలి.

55
ఇలా తినండి

వైద్యులు చెబుతున్న ప్రకారం సరిగా కడగని కూరగాయలు తినడం వల్ల ఈ పురుగు మెదడులో చేరే అవకాశాలు అధికం. ముఖ్యంగా క్యాబేజీతోనే ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. క్యాబేజీ పొరలు పొరలుగా ఉంటాయి. ఈ పొరల్లోనే ఈ పురుగులు దాగి ఉంటాయి. కాబట్టి క్యాబేజీలోని ప్రతి పొరను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. క్యాబేజీని సన్నగా తరిగి నీటిలో వేసి పరిశుభ్రంగా కడగాలి. రెండు మూడు సార్లు కడగాల్సి వస్తుంది. లేదా పొరలు పొరలుగా విడదీసి ప్రతిపొరని కుళాయి కింద పెట్టి శుభ్రంగా కడిగి ఆ తర్వాతే వండుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories