మన భారతదేశంలోనే పుట్టిన అందమైన కళ... రంగోలి. వేడుక ఏదైనా సరే ఇంటి ముందు ఒక ముగ్గు కొలువు తీరాల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవాన్ని రంగోలి డిజైన్లను ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ ఎంతో సింపుల్ గా ఉంటాయి.
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేస్తోంది. ఆరోజు ఆఫీసుల ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు, ఇంటి ముందు కూడా రంగోలిని వేసేవారు. ఎంతోమంది ఇండిపెండెన్స్ డే థీమ్ తో ముగ్గులు వేయాలని ఎంతోమంది అనుకుంటారు. ఇక్కడ మేము సింపుల్ రంగోలి డిజైన్లు అందించాము. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని ఈ రంగోలిలను ప్రయత్నించండి.
25
మూడు రంగులతోనే
స్వాతంత్య్ర దినోత్సవం నాడు వేసే ముగ్గుకు కేవలం మూడు రంగులతో మాత్రమే నింపాలి. త్రివర్ణ పతాకంలో ఉన్న తెలుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులు వేస్తే స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ ఉట్టిపడుతుంది. సాధారణ ముగ్గు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక అశోక చక్రానికి నీలం రంగు వేయడం మర్చిపోవద్దు.
35
జాతీయ చిహ్నలతో డిజైన్
స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ చిహ్నాలు అయిన తామర పువ్వు, నెమలి వంటి చిహ్నాలను కూడా రంగోలి రూపంలో వేయవచ్చు. వాటికి అందమైన రంగులను దిద్దవచ్చు. అయితే వాటికి కూడా ఆ రోజు కేవలం ఆకుపచ్చ, కాషాయం, తెలుపు వంటివి వేస్తేనే అద్భుతంగా ఉంటుంది.
45
దేశభక్తి నినాదాలు
ముగ్గుల మధ్యలో జైహింద్, వందేమాతరం వంటి నినాదాలు కూడా రాయడం మర్చిపోకండి. ఇవి ఈ దేశభక్తి నినాదాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలిస్తాయి. రంగోలి అనేది మన భారతదేశంలో సాంప్రదాయ కళగా పేరు తెచ్చుకుంది.
55
ముందుగా ప్రాక్టీసు చేయండి
వేయాలనుకుంటున్న డిజైన్ ముందుగానే ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. లేకుంటే సరిగా మీరు వేయలేకపోవచ్చు. దీనివల్ల పదేపదే చెరిపి వేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే పేపర్ పై రంగోలి డిజైన్లను ప్రాక్టీస్ చేసి ఆ తర్వాతే నేలపైనా లేదా ఫ్లోర్ పైన వేసేందుకు ప్రయత్నించండి. రంగోలిని వేయడం వల్ల ఇంట్లో, ఆనందం, శ్రేయస్సు వస్తాయని పూర్వకాలం నుంచి నమ్ముతారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు రంగోలి వేయడం అనేది జాతీయ సమైక్యతను, దేశభక్తిని సూచిస్తుంది.