అలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. పొద్దంతా కష్టం చేసి.. నైట్ టైం పడుకోవడం వల్ల బాడీ Relaxed గా ఫీలవుతుంది. తద్వారా శరీరం సరికొత్త శక్తిని నింపుకుంటుంది. శరీరానికి కావాల్సిన నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండేది. కంటినిండా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మూడీగా ఉండటం, అలసట, తలనొప్పి, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలా రోజుల వరకు నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం శరీరానికి పెద్ద ప్రమాదమే జరుగుతుంది. సరైన ఫుడ్ తీసుకుంటే ఈ నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే రకరకాల వ్యాయామాల ద్వారా కూడా ఈ నిద్రలేమి సమస్యను తరిమికొట్టొచ్చు. మరి వ్యాయామానికి నిద్రకు ఉన్న సంబంధమేమిటో ఇప్పుడు చూద్దాం.