భోగి పండుగ ఎక్కడ బాగా జరుగుతుందో తెలుసా?

First Published | Jan 13, 2022, 4:38 PM IST

సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగనే భోగి పండుగ (Bhogi festival). అయితే భోగి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయ (Traditional) పద్ధతిలో జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆహ్లాదంగా, సరదాగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ భోగి పండుగను ఎక్కడ బాగా జరుపుకుంటారో తెలుసుకుందాం..
 

భోగి రోజున భోగి మంటలు వేసి భోగి పాటలు పాడుతూ బంధుమిత్రులతో (Relatives) సరదాగా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి రోజున ఇంటి ముందు భోగి మంటలు వేసి వారిలోని కల్మషాలు తొలగిపోవాలని అగ్నికి ఆహుతి చేస్తారు. భోగి మంటలు వేసి భోగభాగ్యాలతో (Luxuries) తులతూగాలని అగ్ని దేవుని ప్రార్థిస్తారు.
 

ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవులు రాగానే ఎక్కడ ఉన్న తమ ఊర్లకు చేరుకోవడానికి బస్టాండ్ లో జనాలు కిటకిటలాడుతూంటారు. సొంత ఊరిలో పల్లెటూరిలో ఈ పండుగను జరుపుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలోనే (Village) ఎక్కువగా కనిపిస్తుంది.
 

Latest Videos


సంక్రాంతికి వారం ముందు రోజుల నుంచే అనేక ప్రదేశాలలో ముఖ్యంగా ముగ్గుల పోటీలు (Rangoli competitions) నిర్వహిస్తారు. గెలిచిన వారికి బహుమతులు ఇస్తూ మన సాంప్రదాయాలను మర్చిపోకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events) చేపడతారు. ఈ తరం వారికి సంక్రాంతి ప్రత్యేకత తెలియడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 

ఇలా జనవరి నెల మొదటి వారం నుంచే పండుగ వాతావరణం (Festive atmosphere) ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. బట్టల దుకాణాలు జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రంగోలి రంగులు అమ్మేవారు దర్శనమిస్తారు (Appear). ఇలా సంక్రాంతికి వారం నుంచి పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది.
 

భోగి రోజున సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోసి దిష్టి తీస్తారు. భోగి పండ్లును శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలుగా (Blessings) భావించి పిల్లల తలపై నుంచి పోస్తారు. ఇలా చేసే పిల్లల మానసిక రుగ్మతలు (Mental disorders) తొలగిపోయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని భావిస్తారు. భోగిపండ్లు సూర్యునికి ప్రీతికరమైన పండ్లు. కనుక భోగి పండ్లను పిల్లలకు పోస్తే వారి ఎదుగుదల బాగుంటుంది అని నమ్మకం.
 

కొత్త ధాన్యం చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఆనందంగా జరుపుకునే ఈ పండుగ రోజున కొత్త బియ్యంతో పొంగలి (Pongali) చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయాన్నే గుమ్మడికాయ (Pumpkin) పగలగొట్టి గుమ్మడికాయతో తీపి పదార్థం చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని మన పూర్వీకులు ఎప్పటినుంచో ఆచరిస్తున్న ఒక సంప్రదాయం.
 

అలాగే భోగి పండుగ రోజు నువ్వులతో (Sesame) అనేక రకాల పిండి వంటకాలను చేసుకుంటారు. ఇంటికి వచ్చిన ఆడపడుచులు, అల్లుళ్ళుతో ఎంతో సరదాగా, ఆనందంగా (Happy) జరుపుకునే పండుగ ఇది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు ఇలా పండుగ వాతావరణం చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది.

click me!