నూనె లేకుండా వంట...
మార్కెట్లో Pigeon బ్రాండ్ కి ఎంత మంచి పేరు ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి బడ్జెట్ రేంజ్ లో ఎయిర్ ఫ్రయ్యర్ మనకు అందుబాటులో ఉంది. అదే Pigeon Healthify Digital Air Fryer.
ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో 4.2 లీటర్ల సామర్థ్యం ఉంది. కాబట్టి.. ఒకే సారి ఎక్కువ క్వాంటిటీలో మనం వంటలు చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, నగ్గెట్స్, చికెన్, కటెలెట్స్ ఇలాంటివన్నీ.. తక్కువ నూనెతో క్రిస్పీగా, టేస్టీగా చేసుకోవచ్చు. 1200 వాట్ల పవర్ తో పనిచేసే ఈ ఎయిర్ ఫ్రయ్యర్ చాలా వేగంగా వంటలు చేయడానికి హెల్ప్ అవుతుంది. సమానంగా ఉడికేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది 360 డిగ్రీల హై స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీంతో.. ఎక్కువ నూనె అవసరం లేకుండా..ఆహారం బయట కరకలాడుతూ, లోపల మెత్తగా ఉడుకుతుంది. ఈ ఎయిర్ ఫ్రయ్యర్ లో వంటలు చేస్తే... మనం రెండు స్పూన్లకు మించి నూనె పట్టదు.