Akshaya Tritiya 2026: అక్షయ తృతీయనాడే మన పురాణాల్లోని ఈ ప్రధాన ఘటనలన్నీ జరిగాయి, అవేంటో తెలుసా?

Published : Apr 17, 2026, 02:52 PM IST

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ అంటే బంగారం కొనే రోజు అని మాత్రమే ఎంతోమందికి గుర్తుంటుంది. కానీ ఆ పండుగకు ఎంతో విలువ ఉంది. మన భారతీయ పురాణాలలో చారిత్రాత్మక ఘట్టాలన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజే ప్రారంభమయ్యాయి. అవేంటో తెలుసుకోండి. 

PREV
14
అక్షయ తృతీయ అంటే..

అక్షయ అనే పదం సంస్కృత భాషకు చెందినది. దానికి అర్థం ‘ఎప్పటికీ నశించని’ ‘ఎప్పటికీ కరిగిపోని’ ‘శాశ్వతంగా నిలిచి ఉండే’ అని అర్థం. ఇక తృతీయ అంటే చంద్రపక్షంలో మూడో రోజు. కాబట్టి అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ తరగని శుభ ఫలితాలను ఇచ్చే రోజు అని అర్థం. ఈ రోజున మీరు చేసే పుణ్యకార్యాలు, దానాలు, పూజలు ఎప్పటికీ తరిగిపోని ఫలితాలను ఇస్తాయని హిందూ సంప్రదాయంలో చెప్పుకుంటారు. అందుకే అక్షయ తృతీయని ఒక శుభదినంగా భావిస్తారు. అక్షయ తృతీయ ఎంత ముఖ్యమైనదంటే మన భారత పురాణాలలో ఎన్నో ముఖ్యమైన ఘటనలు ఈ రోజే జరిగాయి.

24
అన్నపూర్ణా దేవి రక్ష

పురాణ కథలు చెబుతున్న ప్రకారం అక్షయ తృతీయ రోజే పరశురాముడు జన్మించాడు. ఇతడిని మహా శ్రీమహావిష్ణువు అవతారంగా చెప్పుకుంటారు. అలాగే శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడైన సుధాముడిని కలిసి అతనికి అక్షయపాత్రను ఇచ్చాడని అంటారు. ఈ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు. అడుగుతున్న కొద్ది ఇస్తూనే ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దానం చేస్తే మంచిదని.. సంపద, ఆహారం, ఆనందం పెరుగుతాయని అంటారు. అలాగే అన్నపూర్ణాదేవి రక్షణ లభిస్తుందని చెబుతారు.

34
మహాభారత రచన

మరొక ముఖ్యమైన పురాణ కథ ప్రకారం మహాభారత రచన మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ రోజునే. వేద వ్యాసుడు ఈ మహాకావ్యాన్ని చెబుతూ ఉంటే గణేశుడు దాన్ని రచించినట్టు పురాణాల్లో ఉంది. అందుకే అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే జ్ఞానం, సంపద, పుణ్యం అన్నీ వస్తాయని నమ్ముతారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్యుడు వారికి అక్షయపాత్ర ఇస్తాడు. ఆరోజు అక్షయ తృతీయ అని నమ్మకం.

44
కుబేరుడికి ఆధిపత్యం

ఇక మన భారతదేశానికి జీవనది అయిన గంగా.. భూమి పైకి వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ అని చెబుతారు. సత్యయుగం ముగిసిన తరువాత త్రేతా యుగం ప్రారంభమైంది కూడా ఇదే రోజు అని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో అక్షయ తృతీయను కొత్త ఏడాదికి ప్రారంభంగా భావించి పండుగలా చేసుకునే వారని అంటారు. లక్ష్మీదేవిని పూజించిన కుబేరుడికి ఆ దేవి వరమిచ్చి సంపదలకు అధిపతిగా పదవిని ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయేనని చెప్పుకుంటారు. పురాణాల ప్రకారం ఇన్ని శుభ ఘటనలు జరిగిన అక్షయ తృతీయ రోజు.. మీరు చేసే ఎంత చిన్న మంచి పని అయినా కూడా మీకు శుభ ఫలితాలను జీవితాంతం అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories