Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి

Published : Apr 17, 2026, 01:29 PM IST

చిన్న పిల్లలు, పెద్దల మాటలను అనుకరించడం సాధారణమే. కానీ కొన్నిసార్లు వారు అర్థం తెలియకుండానే బూతులు మాట్లాడితే, చాలా మంది పెద్దలు నవ్వి, దాన్ని సరదాగా తీసుకుంటారు. కానీ పెద్దవాళ్లు చేసే ఈ పొరపాటు వల్ల పిల్లల ప్రవర్తన ఎలా మారిపోతుందో తెలుసా? 

PREV
16
Parenting Tips

పిల్లలు చిన్న వయసులో పెద్దల మాటలు అనుకరిస్తూ కొత్త పదాలు నేర్చుకోవడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో వారు బూతులు లేదా అసభ్య పదాలు మాట్లాడితే చాలామంది పెద్దలు నవ్వుతూ ప్రోత్సహిస్తుంటారు. ఈ ప్రవర్తన మొదట సరదాగా అనిపించినా, అది వారి భవిష్యత్ ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సైకాలజీ నిపుణులు.

26
పెద్దల రియాక్షన్ ని బట్టి మాటతీరు

సైకాలజీ ప్రకారం పిల్లలు ఏ పదం మాట్లాడినా పెద్దలు ఎలా స్పందిస్తారో బట్టి వారు ఆ ప్రవర్తనను కొనసాగిస్తారు. ఒకసారి వారు బూతులు మాట్లాడితే పెద్దలు నవ్వితే, అది వారికి “ఇది సరదాగా ఉంది, మళ్లీ చెబితే అందరూ నవ్వుతారు” అనే సంకేతాన్ని ఇస్తుంది. ఈ విధంగా వారు ఆ పదాలను మళ్లీ మళ్లీ ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది క్రమంగా అలవాటుగా మారి, పిల్లల భాషా ప్రవర్తనలో భాగమవుతుంది.

36
ప్రశాంతంగా సరిదిద్దడం

సైకాలజీ ప్రకారం, పిల్లలు భాషను కేవలం సంభాషణ సాధనంగా కాకుండా సామాజిక స్పందన పొందడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే, వారు ఏదైనా పదం వల్ల ఎక్కువ స్పందన వస్తే, దాన్ని మరింతగా ఉపయోగిస్తారు. బూతులు మాట్లాడినప్పుడు పెద్దలు కోప్పడినా, నవ్వినా, లేదా ఎక్కువగా రియాక్ట్ అయినా, అది పిల్లలకు ఒక రకమైన ప్రోత్సాహంగానే ఉంటుంది. అందుకే పిల్లలు అసభ్య పదాలు మాట్లాడినప్పుడు అధికంగా స్పందించకుండా, ప్రశాంతంగా సరిదిద్దాలి.

46
ప్రధాన కారణాలు ఇవే

పిల్లలు బూతులు నేర్చుకోవడానికి ప్రధాన కారణాలు వారి పరిసరాలు. ఇంట్లో పెద్దలు ఉపయోగించే భాష, స్నేహింతులు, టీవీ, మొబైల్ ఫోన్లు వంటివి పిల్లలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డిజిటల్ కంటెంట్ వల్ల పిల్లలు వయసుకు మించిన పదాలు త్వరగా నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులు.. పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు అనే విషయాలను గమనించడం అవసరం.

56
సామాజిక ప్రవర్తనపై ప్రభావం

పిల్లలు చిన్నప్పుడే బూతులు మాట్లాడడం అలవాటు అయితే, వారు స్కూల్‌లో లేదా బయట ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా అదే భాషను ఉపయోగించే అవకాశం ఉంది. దీని వల్ల వారి సంబంధాలు దెబ్బతినవచ్చు, టీచర్లతో, స్నేహితులతో సమస్యలు రావచ్చు. ఇది వారి వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు కోపాన్ని లేదా అసంతృప్తిని వ్యక్తపరచడానికి అసభ్య భాషను ఉపయోగించడం అలవాటు చేసుకుంటారు.

66
బూతులు మాట్లడకుండా ఏం చేయాలంటే?

ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించాలి. పిల్లలు బూతులు మాట్లాడినప్పుడు దాన్ని సరదాగా తీసుకోకుండా, అది సరైన పదం కాదని సున్నితంగా చెప్పాలి. “ఇలా మాట్లాడితే ఎదుటివాళ్లు బాధపడతారు” అని వారికి అర్థమయ్యేలా వివరించాలి. పిల్లలకు సరైన పదాలను నేర్పించాలి.

అంతేకాదు సైకాలజీ ప్రకారం పిల్లలతో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. వారు ఏ పదం ఎక్కడ విన్నారో తెలుసుకోవడం ద్వారా సమస్యను మూలంలోనే పరిష్కరించవచ్చు. వారిని మందలించడం కంటే, అర్థం చేసుకోవడం, మార్గనిర్దేశం చేయడం మంచిది. అలాగే, పిల్లలు మంచి భాష ఉపయోగించినప్పుడు వారిని ప్రోత్సహించడం కూడా ముఖ్యం. ఇలా చేస్తే వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories