Washing Machine: మీరు వాషింగ్ మెషిన్ లో ఎన్ని జతల బట్టలు పెడుతున్నారు..?

Published : Jun 05, 2026, 01:17 PM IST

 Washing Machine: మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా? దానిని రెగ్యులర్ గా వాడుతున్నారా? మెషిన్ ఆన్ చేసిన ప్రతిసారీ ఎన్ని జతల బట్టలు పెడుతున్నారు? అసలు.. లోడ్ కి ఎన్ని జతల బట్టలు పెట్టాలో తెలుసా? 

PREV
13
washing Machine

ఈ రోజుల్లో వాషింగ్ మెషిన్ లేని ఇల్లు లేదనే చెప్పాలి. చిన్నదో పెద్దదో.. ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు.ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నా కూడా చాలా మందికి వాషింగ్ మెషిన్ ఎలా వాడాలో తెలీదు. ముఖ్యంగా దానిని ఆన్ చేసినప్పుడు ఎన్ని జతల దుస్తులు వేయాలి అనే విషయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. వారం రోజులకు సరిపడా బట్టలన్న తెచ్చి వాషింగ్ మెషీన్ లో కుక్కేస్తూ ఉంటారు.ఇలా చేస్తే ఏమౌతుంది? అసలు వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి?

23
ఎక్కువ దుస్తులు పెడితే ఏమౌతుంది?

వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తే చాలు తక్కువలో తక్కువ గంట తిరుగుతుంది. దీని వల్ల చాలా టైమ్ తీసుకుంటుంది.. కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది.. ఒకేసారి అన్ని బట్టలు వేసేస్టే టైమ్, పవర్ కలిసి వస్తాయి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇలా ఎక్కువ బట్టలు ఒకేసారి మిషిల్ పట్టకపోయినా కుక్కి ఉతకడం వల్ల మెషిన్ డ్రమ్ , మోటార్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు.. మోటార్ బాగా హీట్ ఎక్కుతుంది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే మెషిన్ పాడైపోతుంది.

అంతేకాదు.. ఎక్కువ బట్టలు పెట్టడం వల్ల మెషిన్ సరిగా తిరగదు. వాటర్, వాషింగ్ లిక్విడ్.. దుస్తులకు సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. బట్టల మురికి కూడా పోదు. దుర్వాసన కూడా పోదు. వాషింగ్ లిక్విడ్ కూడా.. కొన్ని దుస్తులకు అంటుకుపోయి... బట్టలు ఆరిన తర్వాత ప్యాచుల్లా కనపడుతుంది.

33
మీ వాషింగ్ మెషిన్ కేపాసిటీ ఎంత..?

మనం వాషింగ్ మెషిన్ లో ఎన్ని దుస్తులు వేస్తున్నాం అనేది దాని కేపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది.ప్రతి ఒక్క వాషింగ్ మెషిన్ కీ స్పెసిఫిక్ గా కేపాసిటీ ఉంటుంది. ఉదాహరణకు మీరు 6 కేజీల వాషింగ్ మెషిన్ వాడుతున్నారు అనుకుంటే.. దానికి ఒక లోడ్ కి 8 నుంచి 10 దుస్తుల వరకు మాత్రమే వేయాలి. మీ మెషిన్ 7 కేజీలు అయితే..11 నుంచి 13 రకాల దుస్తులు సరిపోతాయి. అంతేకాకుండా.. వాషింగ్ మెషిన్స్ లో మోడ్స్ కూడా ఉంటాయి. ఏ మోడ్ సెలక్ట్ చేసుకుంటే.. ఎన్ని కేజీల దుస్తులు వేయచ్చు అని మెషిన్ మనకు క్లియర్ గా చూపిస్తుంది. అంత వరకే వేయాలి. అప్పుడు ఎంత కాలం వాడినా మెషిన్ పాడవ్వకుండా మన్నికగా ఉంటుంది.

లోడ్ ఎక్కువైందని ఎలా తెలుసుకోవాలి?

వాషింగ్ మెషిన్ లో లోడ్ ఎక్కువైందని ఎలా తీసుకోవాలి అనే అనుమానం మీకు రావచ్చు. మనం దుస్తులు పెట్టిన తర్వాత.. కూడా మెషిన్ టబ్ కొంచెం అయినా ఖాళీగా ఉందని అనిపించాలి. అప్పుడు మాత్రమే.. కరెక్ట్ గా వేసినట్లు.. మనం చేతులు కూడా పెట్టడానికి ప్లేస్ లేదు అంటే...లోడ్ ఎక్కువైందని తెలుసుకోవాలి. అంటే.. 80 శాతం మాత్రమే దుస్తులు వేస్తే... ఎక్కువ రోజులు మీ వాషింగ్ మెషిన్ మన్నికగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories