Chanakya Niti : భార్యాభర్తలు ఈ పనులు అస్సలు కలిసి చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Published : Jun 05, 2026, 12:28 PM IST

ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. అయితే భార్యాభర్తలు కొన్ని పనులను అస్సలు కలిపి చేయకూడదని ఆయన తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. అవేంటో తెలుసుకుందాం. 

PREV
14
భార్యాభర్తలు కలిసి చేయకూడని పనులేంటి..?

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చక్కగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికీ చాలా మంది పాటిస్తుంటారు. ఆయన సలహాలు మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చాణక్య నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. ఇందులోనే జీవితాన్ని పంచుకున్న భార్యాభర్తలు కొన్ని పనులు అస్సలు కలిసి చేయకూడదని చాణక్యుడు చెప్పారు.

24
భార్యాభర్తలు కలిసి ధ్యానం చేయకూడదు

ఆచార్య చాణక్యుడి ప్రకారం… భార్యాభర్తలు కలిసి ధ్యానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే అలా చేయడం వల్ల వారి దృష్టి మరలుతుంది. అందుకే ఇద్దరూ ఎప్పుడూ కలిసి ధ్యానం చేయకూడదని చాణక్యుడు చెప్పారు. దానికి బదులుగా వేర్వేరుగా ధ్యానం చేసుకోవాలని ఆయన సూచించారు.

34
భార్యాభర్తలు కలిసి చదువుకోవడం మంచిది కాదు

భార్యాభర్తలు కలిసి చదువుకోవడం కూడా మంచిది కాదని చాణక్యుడు చెబుతారు. ఒకవేళ వాళ్లు శ్రద్ధగా చదువుకోవాలనుకుంటే వేర్వేరుగా కూర్చుని చదువుకోవాలని ఆయన సూచించారు. ఒకేదగ్గర కూర్చుని చదువుకోవడం వల్ల వారికి ఏకాగ్రత ఉండదు.. దీంతో చదివినా లాభం ఉండదు. కాబట్టి కలిసి చదువుకోకపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పారు.

44
భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు బట్టలు మార్చుకోకూడదు

భార్యభర్తలు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయమిది... స్త్రీపురుషులు ఎప్పుడూ ఒకరి ముందు ఒకరు బట్టలు మార్చుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది. ముఖ్యంగా మహిళలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు లేదా సరిచేసుకుంటున్నప్పుడు పురుషులు చూడటం మంచిది కాదట. జీవితాన్ని పంచుకున్న భార్యాభర్తలైనా ఇలా చేయకూడదని చాణక్యుడు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories