Dark neck: స్పూను పెరుగుతో మెడ దగ్గర నలుపును ఇలా క్లీన్ చేసేయండి

Published : Nov 24, 2025, 10:23 AM IST

Dark neck:  ముఖం ఎంత మెరిసిపోతున్నా మెడ నల్లగా ఉంటే చూసేందుకు ఏమాత్రం బాగోదు. మెడ మీద ఉన్న నలుపును తొలగించుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంట్లో ఉన్న పెరుగుతో మెడ నలుపును తొలగించుకోవచ్చు.

PREV
16
మెడ నలుపును తొలగించే చిట్కాలు

మెడ నల్లగా ఉండి ముఖం తెల్లగా ఉంటే చూసేందుకు ఏమాత్రం బాగోదు. ముఖానికి రకరకాల క్రీములు రాస్తారు కానీ మెడను మాత్రం మరిచిపోతారు. దీని వల్ల మెడ నల్లగా మారుతుంది. మీకు కూడా మెడ భాగం నల్లగా ఉంటే దాన్ని మెరిపించడం ఎలాగో ఇక్కడ చిట్కాలు ఇచ్చాము. ఇంట్లోనే వీటిని పాటిస్తే మెడ దగ్గర నలుపుదనం తగ్గి మెరిసిపోవడం ఖాయం.

మెడ నల్లగా మారడానికి ఎన్నో ఆరోగ్య కారణాలు ఉన్నాయి.  ఊబకాయం, హార్మోన్లలో మార్పులు, ఇన్సులిన్ నిరోధకత వంటి కారణాల వల్ల కూడా మెడ నల్లగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఉండే వస్తువులతోనే మెడ నలుపును తగ్గించుకోవచ్చు.

26
శనగపిండి, నిమ్మరసం

ప్రతి ఇంట్లో శెనగపిండి, నిమ్మరసం కచ్చితంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు మెడ నలుపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మెడ నలుపును పూర్తిగా తొలగించేందుకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయి. ఇందుకోసం మీరు ఒక స్పూను శనగపిండి తీసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని మెడకు అప్లై చేసుకుని పావుగంట పాటూ వదిలేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

36
పెరుగు, నిమ్మరసం

మీ ఇంట్లో ఒక స్పూను పెరుగు ఉన్నా చాలు మెడను మెరిపించుకోవచ్చు.  ఒక స్పూను పెరుగును ఒక గిన్నెలో వేసి కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని మెడకు పట్టించి పావుగంట పాటూ వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.  దీన్ని ప్రతి రెండు రోజులకోసారి చేస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయ.

46
నిమ్మరసం

చిన్న గిన్నెలో నిమ్మరసాన్ని వేయండి. అందులో దూదిని ముంచి ఆ రసాన్ని మెడకు రాయండి. అలా ఒక పావుగంట సేపు వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయండి చాలు. మెడ నలుపు పోయి మెరుస్తుంది.

56
బంగాళదుంప రసం

ఇంట్లో ఉన్న బంగాళదుంపతో కూడా మెడకు మంచి మెరుపు తెచ్చుకోవచ్చు. ఇందుకోసం బంగాళాదుంపను సన్నగా తురిమి రసాన్ని తీయాలి. ఆ రసాన్ని పావుగంట సేపు మెడకు పట్టించి అలా వదిలేయాలి. తరువాత నీటితో కడిగేస్తే మెడ మెరిసిపోతుంది.

66
రోజ్ వాటర్

రోజ్ వాటర్ తక్కువ ధరకే లభిస్తుంది. రోజ్ వాటర్, నిమ్మరసం రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మెడకు అప్లై చేయాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో కడిగితే మెడ నలుపుదనం తగ్గిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories