బోర్లా పడుకునే నిద్రపోతున్నారా? మీ పని అంతే ఇక..

Published : Feb 05, 2022, 04:24 PM IST

Sleeping : చాలా మందికి బోర్లా పడుకుంటేనే నిద్ర వస్తుంటుంది. కానీ బోర్లా పడుకుని నిద్రించడం వల్ల ముఖ సౌందర్యం తెబ్బతినడమే కాదు.. స్కిన్ కు ఆక్సిజన్ అందదు. తద్వారా చర్మం ఒత్తిడికి లోనయ్యి ముఖంపై ముడతలు వస్తాయి.   

PREV
15
బోర్లా పడుకునే నిద్రపోతున్నారా?  మీ పని అంతే ఇక..

Sleeping : ప్రశాంతమైన జీవితానికి, ఆరోగ్యవంతమైన లైఫ్ కు నిద్ర ఎంతో అవసరం. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించినప్పుడే డే అంతా హ్యాపీగా ముగుస్తుంది. అలాగే ఎలాంటి అలసటకు గురికాకుండా మన రోజు వారి పనులను చురుగ్గా చేయగలుగుతాం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొంతమందికి పక్క కుదరకపోతే నిద్ర రాదు. మరికొంతమందికేమో.. బోర్లా పడుకుంటేనే నిద్రపడుతుంది. ఇలా బోర్లా పడుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీకు బోర్లా పడుకునే అలవాటుంటే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు. మరి బోర్లా పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 

25

బోర్లా పడుకోవడం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాగా చాలా మంది ఆడవారు బోర్లా పడుకునే నిద్రపోతారు. కానీ బోర్లా పడుకుంటే ఛాతిలో నొప్పి వస్తుందట. ఎందుకంటే రాత్రంతా బోర్లా పడుకుని ఉండటం వల్ల ఛాతిపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా ఛాతిలో నొప్పి వస్తుంది. అలా అయితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. లేకుంటే ఆ నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 
 

35

బోర్లా పడుకోవడం వల్ల కలిగే మరో నష్టమేంటో తెలుసా.. ముఖ సౌందర్యం దెబ్బతినడం. బోర్లా పడుకోవడం వల్ల ముఖ చర్మానికి కావాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో చర్మం ఒత్తిడికి గురవుతుంది. తద్వారా ముఖంపై ముడతలు వస్తాయి. అంతేకాదు.. బోర్లా పడుకోవడం వల్ల ముఖానికి బెడ్ షీట్ కు అంటుకుని ఉన్న దుమ్ము, ధూళీ అంటుకుంటాయి. దానివల్ల చర్మ సంబంధిత వ్యాధులు రావడమే కాదు మొటిమలు కూడా ఏర్పడతాయి. 

45

కేవలం ఆడవారే కాదు.. మగవారు కూడా బోర్లా పడుకునే అలవాటును మానుకుంటేనే మంచిది. ఎందుకంటే బోర్లా పడుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తద్వారా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దాంతో అజీర్థి సమస్య వస్తుంది. అంతేకాదు హార్ట్ లో మంట కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 
 

55

బోర్లా పడుకోవడం వల్ల దీర్ఘకాలిక మెడనొప్పి సమస్య వేధించే ప్రమాదముంది. కాగా బోర్లా పడుకోవడం వల్ల మన వెన్నెముక, తల సమానంగా ఉండవు. దానివల్ల మెడ నొప్పి వస్తుంది. అంతేకాదు అలా పడుకుంటే వెన్నెముకపై తీవ్రంగా ఒత్తిడి పడి వెన్నుపూస సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు బోర్లా అస్సలు పడుకోరాదు. అలా పడుకుంటే తల్లితో పాటుగా బిడ్డకు కూడా ప్రమాదమే. అందుకే గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకుంటే అంతా మంచే జరుగుతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories