వాస్తవానికి ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టబోయే ముందు ఇల్లు శుభ్రపరుచుకుని పూజా మందిరంలో, తులసికోట దగ్గర దీపారాధన చేసి తరువాత ఏ పనిమీద వెళ్ళిన శుభ ఫలితాలు (Good results) లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. కానీ ప్రస్తుత కాలంలో అలా చేయడానికి కుదరటం లేదు (Unable to).
స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్లడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు. వారు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత పనివాళ్ళు (Workers) వచ్చి ఇంటికి శుభ్రపరుస్తారు. అలాగే ఒకవేళ స్త్రీ ఇంట్లో ఉన్న భర్త, పిల్లలు ఆఫీసుకు, స్కూల్ కి వెళ్లే సమయం వరకు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకుని పూజ (Puja) చేయడానికి కుదరదు.
భర్త ఉదయమే పూజ చేసి ఆఫీసుకు వెళ్లడంతో తర్వాత ఆమె ఇంటిని శుభ్రపరచుకుంటుంది. వాస్తవానికి ఇది సరైనది కాదు అని శాస్త్రం చెబుతోంది. కనుక అద్భుతమైన (Excellent) శుభఫలితాలను పొందడం (Getting) కోసం శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రపరిచిన తరువాత పూజ చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని వాళ్ళు దీపారాధన వెలుగుతుండగా ఇంటిని శుభ్రపరిచరాదు.
దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి (Anger) గురవుతాము. ఏ పని చేపట్టినా సకాలంలో జరగదు. అన్నింటిలోను నష్టాలు (Losses) కలిగే అవకాశం ఉంటుంది. కష్టాలు మొదలవుతాయి. ఇలా శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దేవతలు ఆగ్రహిస్తారు. కనుక ఉదయం తొందరగా లేచి సూర్యోదయానికి కంటే ముందు ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడం మంచిది.
ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
సూర్యోదయానికి (Sunrise) కంటే ముందు అమృత ఘడియలలో పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం (Grace) మనమీద ఉండి అంతా మంచే జరుగుతుంది. 6 లోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం 7 గంటల లోపయినా పూజ చేయడం మంచిది.
అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది .దీపారాధన చేసిన తర్వాత దీపం వెలుగుతూ ఉండగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రపరిచరాదు. ఇది శాస్త్రానికి విరుద్ధంగా (Contrary) భావిస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా (Financially) నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు.