Biryani: రాత్రిపూట బిర్యానీలను తింటే ఎంత ప్రమాదమో తెలిస్తే.. దాన్ని తినే సాహసం కూడా చేయరు..

Published : Mar 27, 2022, 09:44 AM ISTUpdated : Mar 27, 2022, 09:45 AM IST

Biryani: మార్నింగ్ టైంలో కంటే రాత్రిపూటే బిర్యానీలను లాగించే వారు చాలా మందే ఉంటారు. అయితే బిర్యానీలను రాత్రిపూట తింటే ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్ల ఎప్పుడూ తినరేమో..         

PREV
18
Biryani: రాత్రిపూట బిర్యానీలను తింటే ఎంత ప్రమాదమో తెలిస్తే.. దాన్ని తినే సాహసం కూడా చేయరు..

Biryani: బిర్నానీ స్మెల్ కే నోట్లో లాలాజలం వచ్చేస్తుంటుంది కదూ... అందులోనూ ఇక ఆ బిర్యానీ కలర్ ను చూస్తే చాలు అబ్బా.. దీన్ని ఎప్పుడెప్పుడు కడుపులో వేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇతర ఫుడ్ ఐటమ్స్ కంటే బిర్యానీ లవర్స్ యే ఎక్కువగా ఉంటారు. అందులోనూ హైదరాబాద్ లో అయితే బిర్యానీ రోజుకు ఎన్ని పొట్లాలు అమ్ముడు పోతాయో.. 

28
BIRYANI

కమ్మటి వాసనతో నూరూరించే బిర్యానీ పొట్లాలను రోజుకు ఒకసారైనా ఇష్టంగా లాగించేవారు చాలా మందే ఉన్నారు. నోటికి రుచిగా.. ముక్కు పుటాలకు నచ్చే బిర్యానీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తింటే ఎలాంటి సమస్యా లేదు కానీ.. అదేపనిగా తింటే మాత్రం అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

38

ముఖ్యంగా బిర్యానీలను రాత్రిపూట తింటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. నైట్ టైం బిర్యానీ తింటే సరిగ్గా నిద్రపోరు. పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది. ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇవే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. 

48
BIRYANI

బిర్యానీ పొట్లాలలను మేం ఎక్కువగానే తింటున్నాం. అయినా మాకేం కాలేదు అనేవారు చాలా మందే ఉన్నారు. అయితే తిన్నప్పుడే ప్రభావం చూపకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

58

బిర్యానీ టేస్ట్ కావడానికి ఎన్నో మసాలాలను ఉపయోగిస్తారు. ఇందులో నూనె కూడా ఎక్కువగా పోస్తారు. ఇన్నింటితో మిక్స్ అయి ఉన్న బిర్యానీని ఇష్టంగా లాగిస్తే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది పేగుల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. బిర్యానీ తింటే కొందరికీ అజీర్థి సమస్య వస్తుంటుంది. దానికి కారణంగా ఇవే.. 

68

బిర్యానీ రోజుకు ఒకసారో లేకపోతే రెండు రోజులకో తినడం అస్సలు మంచిది కాదు. అంతగా తినాలనుకుంటే వారానికి ఒకసారి మాత్రమే తినండి. లేకపోతే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

78

బిర్యానీ కలర్ ఫుల్ గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ ను ఉపయోగిస్తారు. ఈ రంగులు నిషేదించబడ్డవి. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటల్లు అలాగే వాడుతున్నాయి. ఈ మనకు హాని చేసే ఆర్టిఫిషియల్ కలర్ లలో టర్ ట్రాజెన్ ఒకటి. ఇది నీళ్లలో చాలా తొందరగా కరుగుతుంది. 

88
boryani

బిర్యానీ అంతా రెడీ అయ్యాక ఈ రంగును జల్లుతారు. ఈ రంగు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిర్యానీలనుు తినడం తగ్గించండి. 

Read more Photos on
click me!

Recommended Stories