Cholesterol: మారుతున్న జీవనశైలీ, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఈ హై కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్న వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. కొలెస్ట్రాల్ పెరిగితే .. ఊబకాయం, హార్ట్ ఎటాక్, డయాబెటిస్, కిడ్నీ వైఫల్యం, అధిక రక్తపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.