Sapota Benefits: సపోటా పండ్లు తింటే మన శరీరానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసా..?

Published : Mar 26, 2022, 04:23 PM IST

Sapota Benefits: సపోటా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఈ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.   

PREV
19
Sapota Benefits: సపోటా పండ్లు తింటే మన శరీరానికి ఎంత  మంచి జరుగుతుందో తెలుసా..?

Sapota Benefits: ఈ కాలంలో సపోటా పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. ఈ పండ్లలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సపోట పండు లేదా సపోటా జ్యూస్ ఏది తీసుకున్నా.. మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. 

29

సపోటా పండులో వివిధ రకాలు పోషకాలు లభిస్తాయి. ఇవి ఎన్నో రోగాలను అడ్డుకుంటాయి. సపోటాలో ఫోలేట్, కాల్షియం, ఐరన్, విటమిన్స్, పొటాషియం, మినరల్స్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవే కాదు.. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. 
 

39

ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంతేకాదు ఇది ఇన్ఫెక్షన్స్ సోకకుండా మనకు రక్షణ కల్పిస్తాయి. అలాగే మన శరీరానికి హానీ చేసే బ్యాక్టీరియా తొలగించేందుకు సహాయపడుతుంది. 

49

సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సపోటాలను తినడం వల్ల దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినండి.
 

59

ఇక ఈ పండులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంతో పాటుగా.. ఎలాంటి కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. 
 

69

కంటిచూపు మందగించిన వారు నిత్యం సపోటాలను తినడం వల్ల వారి కంటిచూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

79

సపోటాలో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతాయి. ఇవి క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్ లను అంతంచేస్తాయి. 

89
Sapota

గర్భిణులు, బాలింతలు కూడా సపోటా పండ్లను ఎలాంటి అనుమానాలు లేకుండా తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

99

క్యాన్సర్ తో పోరాడుతున్న వారు రోజుకు రెండు సపోటాలను తింటే.. క్యాన్సర్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories