దగ్గు, జలుబును నివారిస్తుంది
చలికాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వెల్లుల్లి ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెల్లుల్లి అంటువ్యాధులను, ఇతర అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. సైనసైటిస్, జలుబు, జ్వరాన్ని తొందరగా తగ్గించుకోవడానికి వేడి వేడి పులుసు, సూప్ ల్లో వెల్లల్లుని ఖచ్చితంగా వేయండి. అయితే ముడి వెల్లుల్లిని తీసుకుంటే మరింత ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.