ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తినాల్సినవి, తినకూడనివి ఇవే..!

First Published Oct 21, 2022, 1:59 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారు. బోలు ఎముకల వ్యాధి అంటే ఎముకల బలహీనత అని అర్థం. దీనికి కారణం ఎముక సాంద్రతను కోల్పోవడం. ఈ కారణంగానే ఎముకలు చిన్న  దెబ్బతగిలినా విరిగిపోతుంటాయి. శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ఇది లోపించకుండా చూసుకోవాలి. 
 

bone health

ఈ రోజుల్లో బోలు ఎముకల వ్యాధి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే ఎముకల బలహీనతే బోలు ఎముకల వ్యాధి. ఎముక సాంద్రతను కోల్పోవడం వల్లే ఇలా అవుతుంది. దీనివల్ల ఎముకలు చిన్న దెబ్బకు కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. మీ శరీరంలో విటమిన్ డి లోపిస్తే కూడా బోలు ఎముకల వ్యాధితో పాటుగా ఇతర ఎముకల వ్యాధులు వస్తాయంటున్నారు నిపుణులు.  

ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరమవుతాయి. పేలవమైన ఆహారం, తగినంతగా పోషకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎముకలు, కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం తినే ఆహారానికి.. మన ఎముకల ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తినాలి? ఎలాంటి వాటిని తినకూడదో తెలుసుకుందాం పదండి. 

calcium

కాల్షియం

ఎముకల ఆరోగ్యానికి  కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం కాల్షియం. ఈ కాల్షియం మీ శరీరంలో లోపిస్తేనే ఎముకలు బలహీనపడతాయి. అయితే ఈ కాల్షియం ను మన శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి  అవసరపడుతుంది. ఇందుకోసం పాలు, పెరుగు, జున్ను,  బీన్స్, సార్డినెస్, ఆకుకూరను తప్పకుండా తినండి. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆహారాలు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

విటమిన్ డి

కాల్షియం శోషించుకోవాలంటే విటమిన్ డి చాలా అవసరం. ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా .. ఇది ఒక్క ఆహార పదార్థాల్లోనే కాదు.. సూర్యరశ్మి ద్వారా కూడా లభిస్తుంది. పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్డు పచ్చసొనలో కూడా విటమిన్ డి ఉంటుంది. అలాగే చేపల్లో కూడా ఉంటుంది. ముఖ్యంగా 'సాల్మన్' చేపలు విటమిన్ డికి గొప్ప మూలం. పుట్టగొడుగులు, తృణధాన్యాలు, చిక్కుళ్లను తింటే కూడా విటమిన్ లభిస్తుంది. 

ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటే కూడా ఎముకలు బలంగా ఉంటాయి. బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పులు వంటి డ్రై ఫ్రూట్స్ ను రోజూ గుప్పెడు తినండి. ఈ గింజలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచివి. గుడ్లు, చేపలు కూడా ప్రోటీనన్లకు మంచి మూలం. 

vegetables

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. 
 

salt

తినకూడని ఆహారాలు

బోలు ఎముకల వ్యాధితో బాధపడేవారే కాదు ఇతరులు కూడా ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పు ఎములను బలహీనపరుస్తుంది. అలాగే ఆల్కహాల్ ను కూడా తక్కువగా తాగండి. కాఫీని మొత్తమే మానుకోవడం బెటర్. స్మోకింగ్ చేయడం డేంజర్.  

click me!